H-1B Visa : ఫిబ్రవరిలో ప్రారంభం కానున్న హెచ్‌ 1 బీ వీసా ఆన్‌లైన్ ఫైలింగ్

2025 ఆర్ధిక సంవత్సరానికి గాను హెచ్ 1 బీ వీసా( H-1B Visa ) దరఖాస్తులకు గాను ఆన్‌లైన్ అప్లికేషన్ ఫైలింగ్ ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌‌సీఐఎస్) ప్రకటించింది.సంస్థ ఖాతాలు, సంస్థ లేదా ఇతర వ్యాపార సంస్థతో సహా సంస్థలోని వ్యక్తులు వారి న్యాయ సలహాదారులను హెచ్ 1 రిజిస్ట్రేషన్లు, ఫారం ఐ 129 (ఇమ్మిగ్రెంట్ వర్కర్ కోసం పిటిషన్), అనుబంధ ఫాంల తయారీలో సహకరించడానికి అనుమతిస్తాయని యూఎస్‌సీఐఎస్( USCIS ) తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.

 H 1b Visa Online Filing For Fy25 To Begin In February 2024-TeluguStop.com

యూఎస్‌సీఐఎస్ ఎల్లప్పుడూ ప్రక్రియలను మెరుగుపరచడానికి, క్రమబద్ధీకరించడానికి ప్రయత్నిస్తుందని ఏజెన్సీ డైరెక్టర్ ఉర్ ఎం జద్దౌ( USCIS Director Ur M Jaddou ) అన్నారు.హెచ్ 1 బీ వీసా పిటిషన్‌లను సమర్పించడానికి మూడు వేర్వేరు పద్ధతులు అందుబాటులో వున్నాయి.

పిటిషనర్ సంస్థ ఖాతా, పిటిషనర్ చట్టపరమైన ప్రాతినిథ్యం , సాంప్రదాయ పత్రాలు ‌ఆన్‌లైన్‌లో సమర్పించవచ్చని పేర్కొంది.హెచ్ 1 నమోదు ప్రక్రియను ప్రారంభించే ముందు సంస్థలకు , న్యాయ సలహాదారులకు సహాయం చేయడానికి యూఎస్‌సీఎస్ సంస్థాగత ఖాతాలపై దేశవ్యాప్తంగా రెండు ఎంగేజ్‌మెంట్ సెషన్‌లను జనవరి 23, జనవరి 24న నిర్వహించనుంది.

Telugu America Visa, February, Fy, Visa, Visa Ups, Citizenship, Uscis Ur Jaddou-

ఎఫ్‌వై 2025 హెచ్ 1 ఎలక్ట్రానిక్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ , హెచ్ 1 బీ పిటిషన్‌ల( H-1B Visa Petitions ) కోసం ఫాం ఐ 129 ఆన్‌లైన్ ఫైల్‌ను ప్రారంభించడంపై సన్నాహకంగా సంస్థ ఖాతాల గురించి ప్రశ్నలు అడగటానికి ఈ సెషన్‌లు వ్యక్తులకు అవకాశాన్ని అందిస్తాయి.కాగా.నైపుణ్యం కలిగిన విదేశీ వృత్తి నిపుణులు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసుకునేందుకు వీలు కల్పించే హెచ్ 1 బీ వీసాలకు సంబంధించి ఎప్పుడూ ఏదో వివాదం వుంటూనే వుంటుంది.

Telugu America Visa, February, Fy, Visa, Visa Ups, Citizenship, Uscis Ur Jaddou-

ఏటా హెచ్‌-1బీ వీసాల కోసం లక్షల సంఖ్యలో దరఖాస్తులు వస్తుంటాయి.వీటిలో కంప్యూటర్‌ ఆధారిత లాటరీ పద్ధతి ద్వారా 65వేల దరఖాస్తులను ఎంపిక చేసి అమెరికా వీసా( America Visa ) జారీ చేస్తుంది.వీటితో పాటు సైన్స్‌, టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, మ్యాథమెటిక్స్‌ (STEM) విభాగాల్లో అమెరికా యూనివర్శిటీల్లో ఉన్నత విద్య పూర్తి చేసిన విదేశీ విద్యార్థులకు మరో 20వేల వీసాలు ఇస్తారు.

అంటే మొత్తం 85 వేల హెచ్ 1 బీ వీసాలన్న మాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube