కథ చెప్పాలని వెళ్తే ఆ నిర్మాత వాచ్ మేన్ కు చెప్పమన్నారు.. హనుమాన్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్, బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీలలో ప్రశాంత్ వర్మకు ( Prashant Verma )ఊహించని స్థాయిలో గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే.హనుమాన్ సినిమా( Hanuman movie ) సక్సెస్ తో ప్రశాంత్ వర్మ పేరు మారుమ్రోగుతుండగా గతంలో ఒక ఇంటర్వ్యూలో ప్రశాంత్ వర్మ వెల్లడించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.

 Hanuman Director Comments Goes Viral In Social Media Detais Here , Social Media,-TeluguStop.com

తక్కువ బడ్జెట్ తో సినిమా చేస్తామంటే చాలామంది నిర్మాతలు సిద్ధంగా ఉంటారని ఆయన అన్నారు.

అ! సినిమాకు నేను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదని ప్రశాంత్ వర్మ తెలిపారు.

ఇండస్ట్రీలో అన్ని రకాల అవమానాలు చూశానని ఆయన వెల్లడించారు.కథ చెబుతానంటే నిద్రపోయిన నిర్మాతలు ఉన్నారని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు.

ఒక ప్రొడ్యూసర్ రాత్రి 2 గంటల సమయంలో కథ వింటానని చెబితే వెళ్లానని ఆయన మందు సిట్టింగ్ పెట్టుకుని కథ చెప్పమన్నారని ఆయన కామెంట్లు చేశారు.

Telugu Bollywood, Hanuman, Boy, Prashant Verma, Tollywood, Watch-Movie

ఆరోజు రెండు మూడు కిలోమీటర్లు నడిచి ఇంటికి వెళ్లానని ప్రశాంత్ వర్మ వెల్లడించారు.కొంతమంది నిర్మాతలు వాచ్ మేన్ కు, ఆఫీస్ బాయ్ కు( watch man, office boy ) కథ చెప్పాలని కోరారని ఆయన అన్నారు.నేను నా లైఫ్ లో 300, 400 నరేషన్స్ ఇచ్చానని ప్రశాంత్ వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు.

సినిమా అనేది ఒక ట్రావెల్ అని నాకు ఇచ్చి బౌన్స్ అయిన చెక్కులు చాలా ఉన్నాయని ఆయన వెల్లడించారు.

Telugu Bollywood, Hanuman, Boy, Prashant Verma, Tollywood, Watch-Movie

మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ ఆగిపోయిన సినిమాలు ఉన్నాయని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు.హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ సెట్ కు వస్తున్నాడని చెప్పి సినిమా చేయనని హీరోలు చెప్పిన సందర్భాలు ఉన్నాయని ఆయన కామెంట్లు చేశారు.ప్రశాంత్ వర్మ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హనుమాన్ సక్సెస్ తో ప్రశాంత్ వర్మకు ఆఫర్లు పెరుగుతాయని చెప్పవచ్చు.నేను కెరీర్ పరంగా సక్సెస్ సాధించడానికి ఎన్నో కష్టాలు పడ్డానని ప్రశాంత్ వర్మ పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube