బిగ్ బాస్ సీజన్ సెవెన్ కార్యక్రమం ద్వారా కంటెస్టెంట్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి ప్రియాంక జైన్( Priyanka Jain ) ఒకరు.ఈమె బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించి నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇలా నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఉన్నటువంటి ఈమెకు బిగ్ బాస్ ( Bigg Boss ) అవకాశం వచ్చింది.ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇక ఈమె వ్యక్తిగత విషయానికి వస్తే మౌనరాగం సీరియల్ లో ఈమె శివకుమార్ ( Shiva Kumar ) అనే సీరియల్ నటుడితో కలిసి చేశారు.అయితే ఈ సీరియల్ సమయంలోనే ఈమె శివకుమార్ తో ప్రేమలో పడిందనే సంగతి తెలిసిందే.

ఈ విధంగా శివకుమార్ ప్రేమలో ఉన్నటువంటి ఈమె త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్న సంగతి మనకు తెలిసిందే బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్ లో భాగంగా శివకుమార్ తన కోసం హౌస్ లోకి వెళ్ళగా ఈమె మనం తొందరగా పెళ్లి చేసుకుందాం అంటూ మాట్లాడారు .అయితే బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ అభిమానులు ప్రశ్నించడంతో ఈ ఏడాదిలోనే తమ పెళ్లి ఉంటుంది అంటూ ప్రియాంక తెలియచేశారు.ఇకపోతే తాజాగా ఈ జంట తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము అమెరికా ( America ) వెళ్ళబోతున్నాము అంటూ అందరికీ షాక్ ఇచ్చారు.

ఇలా ఈమె అమెరికా వెళ్ళబోతున్నాము అని చెప్పడంతో ఇక తన ప్రియుడుతో కలిసి ఈమె పర్మినెంట్ గా అక్కడే సెటిల్ అవుతున్నారని అందరు భావించారు కానీ మెల్లమెల్లగా ఈమె అసలు విషయం వెల్లడించారు.ఎయిర్ పోర్టులో తన ప్రియుడికి సెండ్ ఆఫ్ తో ఉన్నటువంటి ఒక వీడియోని ఈమె షేర్ చేశారు.అయితే అమెరికాకు తాను వెళ్లడం లేదని శివ ఒక్కడే వెళ్తున్నారని ఈమె తెలిపారు.
వీసా కోసం అప్లై చేయగా ఇంటర్వ్యూ కోసం ఢిల్లీ రమ్మన్నారని అయితే ప్రస్తుతం శివ ఢిల్లీకి వెళ్లారని ఇంటర్వ్యూలో ఆయన సెలెక్ట్ కావడంతో రెండు నెలల పాటు అమెరికా వెళ్తున్నారంటూ ఈమె అసలు విషయం బయట పెట్టారు.







