ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు.తన కూతురికి సీటు ఇవ్వాలని సీఎం జగన్ ను కోరిన మాట వాస్తవమని తెలిపారు.
తనకు గ్రూపు రాజకీయాలు తెలియవని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి పేర్కొన్నారు.ఒక వ్యక్తి అధిష్టానానికి తనపై లేనిపోని విషయాలు చెప్పారని మండిపడ్డారు.
తాను గ్రూపు రాజకీయాలు చేస్తున్నానని తనపై పార్టీ హైకమాండ్ కు తప్పుడు సమాచారం ఇచ్చారని తెలిపారు.అవినీతి చేశానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వెల్లడించారు.







