ఏదైనా పండుగలు వస్తే తప్పనిసరిగా మెగా ఫ్యామిలీ( Mega Family ) మొత్తం ఒకే చోట చేరి పెద్ద ఎత్తున ఆ పండుగను జరుపుకుంటారనే సంగతి మనకు తెలిసిందే.ఇలా ప్రతి ఏడాది అన్ని పండుగలను మెగా కుటుంబ సభ్యులందరూ ఒకే చోటకు చేరి ఎంతో ఘనంగా జరుపుకుంటారు.
ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగను కూడా అదే విధంగా జరుపుకోవడానికి సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ మొత్తం సంక్రాంతి పండుగను(Sankranti Festival) జరుపుకోవడం కోసం బెంగళూరుకు వెళ్లారు.గత ఏడాది కూడా మెగా కుటుంబ సభ్యులందరూ బెంగళూరులోని ఫామ్ హౌస్ లో సంక్రాంతి వేడుకలను జరుపుకున్నారు.

ఇక ఈ ఏడాది కూడా మెగా కుటుంబం బెంగుళూరులోనే సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది.ఇప్పటికి మెగా ఫ్యామిలీ మొత్తం బెంగళూరు వెళ్ళగా తాజాగా ఉపాసన (Upasana) రాంచరణ్(Ram Charan) కూడా బెంగళూరుకు వెళ్లారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి ఎయిర్ పోర్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.తమ కూతురు క్లిన్ కారా(Klin Kaara) తో కలిసి రామ్ చరణ్ ఉపాసన బెంగళూరుకు వెళ్లారు.

ఇక ఈ ఫోటోలలో భాగంగా ఉపాసన తన పెట్ రైమ్ ను ఎత్తుకొని ఉండగా రామ్ చరణ్ తన కుమార్తెను ఎత్తుకొని వెళ్లారు.అయితే ఇప్పుడు కూడా తమ చిన్నారి ఫేస్ కనపడకుండా రామ్ చరణ్ కూడా ఎంతో జాగ్రత్త పడ్డారు.చిన్నారి జన్మించి దాదాపు 7 నెలలు అవుతున్న ఇప్పటివరకు ఈ దంపతులు తమ చిన్నారి ఎలా ఉంటుంది అనే విషయాలను మాత్రం తెలియజేయలేదు.ఇక ఈయన తన సినిమా షెడ్యూల్ షూటింగ్లో భాగంగా హైదరాబాద్ లోనే ఉండగా ఫ్యామిలీ మొత్తం బెంగళూరుకు వెళ్లారు.
ఇక రాంచరణ్ కూడా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చి తన భార్య కూతురుతో కలిసి బెంగళూరు చేరుకున్నారు.







