తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు...

తిరుమల: తిరుమల శ్రీవారిని( Tirumala Srivaru ) పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవి శేష సాయి,( Justive AV Sesha Sai ) నిజామాబాద్ బిజెపి పార్లమెంట్ సభ్యులు అరవింద్,( MP Arvind ) తెలుగుదేశం పార్టీ నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు, ( Devineni Uma Maheshwara Rao ) వేరువేరుగా దర్శించి మొక్కులు తీర్చుకున్నారు.

 Mp Arvind Devineni Uma Justice Av Sesha Sai Darshans Tirumala Today, Mp Arvind ,-TeluguStop.com

వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికే దర్శన ఏర్పాట్లు చేశారు.

దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి, శేష వస్త్రంతో సత్కరించారు… ఆలయం వెలుపల నిజామాబాద్ బిజెపి పార్లమెంట్ సభ్యులు అరవింద్ మాట్లాడుతూ, కులమతాలకు ,దేశాలకు అతీతంగా అందరూ శ్రీరామ స్మరణం చేసుకుంటూ ఆయనకు స్వాగతం పలకాలని కోరారు.

వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి( BJP ) డబుల్ డిజిట్ స్థానం సాధిస్తుందన్నారు.టిడిపి నాయకులు దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, అయోధ్యలో రామ మందిరం నిర్మాణం పూర్తి చేసుకుని, ప్రారంభిస్తున్న వేళ, రామ రాజ్యం రావాలని, అన్ని ప్రాజెక్టులు పూర్తిచేసుకుని ప్రజలు సుభిక్షంగా ఉండాలని, శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube