సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో రోహిత్ శర్మ..!

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ( Rohit Sharma ) ఓ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు కేవలం ఒకే ఒక అడుగు దూరంలో ఉన్నాడు.ఆ చరిత్రతో ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడిగా నిల్వనున్నాడు.

 Rohit Sharma To Become First Player To Play In 150 T20is Details, Rohit Sharma ,-TeluguStop.com

ఇంతకీ ఆ చరిత్ర ఏమిటంటే.రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ లో( International Cricket ) ఇప్పటివరకు 149 టీ20 మ్యాచ్లు ఆడాడు.

భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే రెండో టీ20 మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ 150 మ్యాచ్లను పూర్తి చేసుకోనున్నాడు.

దీంతో అంతర్జాతీయ టీ20 క్రికెట్లో( T20 Cricket ) 150 మ్యాచులు ఆడిన ఒకే ఒక్క ఆటగాడిగా భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త చరిత్ర సృష్టించనున్నాడు.

ఈ రికార్డ్ ను ఇప్పట్లో ఇతర ఆటగాళ్లు ఎవరు అందుకునే అవకాశాలే లేవు.రోహిత్ శర్మ 149 మ్యాచులలో 141 ఇన్నింగ్స్ లలో 30కి పైగా సగటుతో 3853 పరుగులు చేశాడు.

ఇందులో నాలుగు సెంచరీలు, 29 అర్థ సెంచరీలు ఉన్నాయి.

Telugu Rohit Sharma, George Dockrell, Paul, Shoaib Malik-Sports News క్ర

ఈ జాబితాలో రెండవ స్థానంలో ఐర్లాండ్ ఆటగాడైన పాల్ స్టిర్లింగ్( Paul Stirling ) ఉన్నాడు.పాల్ స్టిర్లింగ్ ఇప్పటివరకు 134 టీ20 మ్యాచ్ లు ఆడాడు.మూడవ స్థానంలో మరో ఐర్లాండ్ ఆటగాడైన జార్జ్ డాక్రెల్( George Dockrell ) ఉన్నాడు.

జార్జ్ డాక్రెల్ ఇప్పటివరకు 128 టీ20 మ్యాచ్ లు ఆడాడు.పాకిస్తాన్ మాజీ ప్లేయర్ షోయబ్ మాలిక్( Shoaib Malik ) 124 టీ20 మ్యాచ్ లు ఆడి నాలుగవ స్థానంలో ఉండగా.

న్యూజిలాండ్ మాజీ ప్లేయర్ మార్టిన్ గుప్తిల్( Martin Guptill ) 122 టీ20 మ్యాచ్లతో ఐదవ స్థానంలో ఉన్నాడు.

Telugu Rohit Sharma, George Dockrell, Paul, Shoaib Malik-Sports News క్ర

ఆదివారం ఇండోర్ వేదికగా జరిగే రెండో టీ20 మ్యాచ్ తో రోహిత్ శర్మ 150 మ్యాచులు పూర్తి చేసుకుంటాడు.ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ సెంచరీ తో అదరగొట్టాలని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు.అంతేకాకుండా రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ ఎంతో స్పెషల్ కాబట్టి మ్యాచ్ గెలిచి, మరో మ్యాచ్ మిగిలి ఉండగనే టీ20 సిరీస్ కైవసం చేసుకోవాలని క్రికెట్ అభిమానుల కోరిక.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube