గుంటూరు కారం సినిమా ఖచ్చితంగా వెరీ బ్యాడ్ అయితే ఏమీ కాదు కానీ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ రేంజ్ సినిమా కాదు అనేది ప్రతి ఒక్కరి నోటి నుంచి వస్తున్న మాట.అయితే ఇలా ఒక సినిమా నెగిటివ్ టాక్ లేదా ప్యూర్ టాక్ అందుకోవడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి ఇలాంటి స్టాక్ రావడం ఇదే మీ కొత్త కాదు చాలామంది దర్శకులు ఈ పరంపరలో వెనక్కి వెళ్ళిపోతున్నారు ఎన్నో అద్భుతమైన సినిమాలను RGV, కృష్ణవంశీ, శ్రీను వైట్ల, పూరి జగన్నాథ్, వి వి వినాయక్ లాంటి దర్శకులు అందరూ పరాజయాలు పొంది వెనక్కి వెళ్ళిపోయా.
రు ఇప్పుడు త్రివిక్రమ్( Trivikram ) వంతు వచ్చింది రేపు రాజమౌళి వంతు కూడా రావచ్చు.చాలామంది దర్శకులకు హిట్ వచ్చాక ఒక కంఫర్ట్ జోన్ వస్తుంది కంఫర్ట్ జోన్ వచ్చింది అంటే క్రియేటివిటీ చచ్చిపోతుంది.
ఎంత మేధావితనం ఉన్న అది మొద్దుబారి పోతుంది.

ఒక సినిమా హిట్ అవ్వాలంటే హీరో బాగా నటిస్తే సరిపోదు దర్శకుడు మాత్రమే క్రియేటివ్ గా పని చేయాల్సి ఉంటుంది అందుకే అతనిని కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు అతని పనితనం చచ్చిపోతే సినిమా కచ్చితంగా చచ్చిపోతుంది అందుకే చాలామంది హీరోలు సినిమాలో అద్భుతంగా నటిస్తారు కానీ కథలో లోపాలు, స్క్రీన్ ప్లే లో అవకతవకలు జరుగుతాయి.అందుకు గుంటూరు కారం( Guntur Kaaram ), త్రివిక్రమ్ ఎలాంటి అతీతం కాదు.కథ ఎలా ఉన్నావ్ స్క్రీన్ ప్లే తో అద్భుతంగా మ్యాజిక్ చేసే సత్తా ఉండి కూడా త్రివిక్రమ్ ఈ చిత్రంలో సరిగా పని చేయలేదు అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది.

బయట త్రివిక్రమ్ లాంటి దర్శకులు మరొకరు ఉండరు.కానీ దర్శకులు కావాలని పొట్ట చేత పట్టుకొని కడుపు కాలుతున్న కథలు రాసుకుని ఎవరు అవకాశం ఇస్తారా అని ఎదురు చూసేవారు వందల్లో ఉన్నారు… వేళల్లో కూడా ఉంటారు.

అలాంటి వారిని చూసినప్పుడల్లా కడుపు రగిలిపోతూ ఉంటుంది.ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా వారికి అవకాశం దొరకదు.అవకాశాలు దొరికిన చాలా మంది స్టార్ డైరెక్టర్స్ వారు కంఫర్ట్ జోన్ దాటి బయటకు రాలేక సినిమాలను కిల్ చేస్తూ ఉన్నారు.ఖచ్చితంగా కసిగా తీసేవాడి కడుపు ఎప్పుడు కాలుతూనే ఉంటుంది.
అందుకే వాడు మరీ కసిగా సినిమా తీస్తాడు.చాలా మంది క్రియేటివ్ డైరెక్టర్స్ తమ క్రియేటివిటీని, కసిని మొదటి రెండు సినిమాల దగ్గరే ఆపేస్తారు మూడో సినిమా నుంచి వారిలో ఆ కసి కనిపించదు.
ఇకనైనా మేలుకొని కొత్తవారికి అవకాశాలు ఇవ్వాలి నిర్మాతలు.వందల కోట్లు ఖర్చుపెట్టి బదులు చిన్న సినిమాలైనా సరే ఐదు కోట్లు ఇచ్చి చాలామంది యువ దర్శకులను ఎంకరేజ్ చేయొచ్చు.
ఈ పద్ధతి మారితే మంచి సినిమాలు వచ్చే అవకాశం బోలెడంత ఉంటుంది.ప్రశాంత్ వర్మ ( Prashanth varma )కూడా పెద్ద డైరెక్టర్ ఏమీ కాదు అతడు కథలో లోపాలు చేయలేదు.







