ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Arvind Kejriwal ) కి ఈడీ అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు.కాగా కేజ్రీవాల్ కి ఈడీ నాలుగోసారి నోటీసులు జారీ చేసింది.
ఈ మేరకు ఈ నెల 18వ తేదీన కేజ్రీవాల్ ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో ప్రశ్నించేందుకు గతంలో మూడు సార్లు ఈడీ నోటీసులు ఇవ్వగా ఆయన విచారణకు గైర్హాజరు అయ్యారన్న సంగతి తెలిసిందే.







