తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు.ఇందులో భాగంగా ఇవాళ ఏఐసీసీ ముఖ్యనేతలతో భేటీ కానున్నారు.
అనంతరం కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీని సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )మర్యాద పూర్వకంగా కలవనున్నారు.రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ నుంచి సోనియా గాంధీ పోటీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి వివరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
క్యాబినెట్ విస్తరణపై కూడా ఏఐసీసీ పెద్దలతో కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం.దాంతోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రతిపాదనలను అధిష్టానం ముందు ఉంచే అవకాశం ఉంది.
అలాగే రేపు మణిపుర్ లో రాహుల్ గాంధీ చేపట్టనున్న భారత్ జోడో న్యాయ యాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు.