రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం గాంధీనగర్ లోని ఉజ్వల హై స్కూల్ లో ముందస్తు సంక్రాంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.భోగిమంటలు, రంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలతో పాఠశాల ముంగిట పండగ వాతావరణం నెలకొంది.
విద్యార్థులు సంప్రదాయ దుస్తులు ధరించి వివిధ రకాల వేషధారణలో అలరించారు.విద్యార్థినులు వేసిన రంగవల్లులు మరింత ఆకట్టుకున్నాయి.
విద్యార్థులంతా పండగ వాతావరణంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా సంక్రాంతి వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో స్కూల్ కరస్పాండెంట్ వి.అరునాద్రి, స్కూల్ డైరెక్టర్.పి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ…ప్రస్తుత తరానికి తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేందుకే వేడుకలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.విద్యార్థినీ విద్యార్థులకు వారి కుటుంబాలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో తల్లితండ్రులు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







