తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటు ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే తేజ సజ్జా హీరోగా వచ్చిన హనుమాన్ సినిమా( Hanuman movie ) ఈరోజు రిలీజ్ అయి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది.
అయితే ఇప్పటికే తేజ సజ్జా( Teja Sajja ) హీరోగా రెండు మూడు సినిమాలు చేసినప్పటికీ అందులో జాంబీరెడ్డి సినిమా మాత్రం మంచి విజయాన్ని అందుకుంది.

అంటే మిగిలిన సినిమాలు ప్రేక్షకులను కొంతవరకు నిరాశ పరిచినప్పటికి ఇప్పుడు ఆయన చేసిన హనుమాన్ సినిమా సూపర్ సక్సెస్ అవ్వానున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఇప్పుడు ఆయన హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటాడు అని అనడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.ఇక తనకి స్టార్ డైరెక్టర్ల నుంచి ఆఫర్లు కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి.
హనుమాన్ సినిమాలో ఆయన హీరోగా చేయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో ఆఫర్ రావాలంటే మామూలు విషయం కాదు.

అలాంటిది ప్రశాంత్ వర్మ తన ఫ్రెండ్ అని చెప్పి తేజ సజ్జా ఈ సినిమాలోకి తీసుకోవడం అనేది నిజంగా గ్రేట్ వాళ్ళ ఫ్రెండ్షిప్ కి హ్యాట్సాఫ్ అనే చెప్పాలి.ఇక ఈ సినిమా ఇచ్చిన బూస్టప్ తో తేజ సజ్జా మరిన్ని కొత్త సబ్జెక్టులతో ప్రేక్షకుల్ని అలరించడానికి రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది.మరి ఈయన సాధించిన ఈ విజయం మరిన్ని సినిమాలతో కంటిన్యూ చేయాలని కూడా తేజ అభిమానులు కోరుకుంటున్నారు.ఇక ఈయన తర్వాత ఒక తమిళ్ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్టు గా తెలుస్తుంది.
మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ కొట్టి ఇండస్ట్రీ లో నిలబడుతాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక మీదట ఆయన చాలా అచి తూచి ముందుకు వెళ్తే బాగుంటుంది.








