Aamir Khan : కూతురు పెళ్లిలో కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో అమీర్ ఖాన్.. ఈ తండ్రి ప్రేమకు ఫిదా అవ్వాల్సిందే!

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ( Aamir Khan )ఇంట ప్రస్తుతం సంబరాలు జరుగుతున్నాయి.ఎందుకంటే అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

 Aamir Khan Tears Up At Daughter Ira Khan Wedding To Nupur Shikhare In Udaipur W-TeluguStop.com

అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.అయితే ప్రతి తల్లిదండ్రుల లాగే అమీర్ ఖాన్ కూడా కూతురి పెళ్లిలో ఎమోషనల్ అయ్యారు.

గతంలో ఒక ఇంటర్వ్యూలలో అమీర్ ఖాన్ మాట్లాడుతూ.ఆమె పెళ్లి రోజున నేను చాలా ఏడుస్తాను అని చెప్పాడు.

కాగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఐరా ఖాన్, నూపుర్ శిఖరే ( Aira Khan, Nupur Shikre )వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.

గత వారం ఉదయ్‌పూర్‌లో ముంబైలో రిజిస్టర్డ్ పద్ధతిలో వివాహం చేసుకున్న తరువాత వారిద్దరూ జీవితాంతం ఒకరికొకరు మద్దతు ఇస్తామని క్రైస్తవ పద్దతిలో వాగ్దానం చేసుకున్నారు.ఈ సమయంలో, అమీర్, అతని మొదటి భార్య రీనా దత్తా ( Reena Dutta )తమ కుమార్తెను చేతితో పట్టుకుని వెళుతున్నప్పుడు అమీర్ కళ్లలో నీళ్లు తిరిగాయి.అంతే కాదు ఐరా,నుపుర్ ఒకరికొకరు ఉంగరాలు పెట్టుకున్నప్పుడు అమీర్ కళ్ళలో నీళ్లు తిరిగాయి.

కాగా ప్రస్తుతం ఐరా, నూపూర్ పెళ్లికి సంబంధించిన ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఐరా పెళ్లికి ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమీర్ మాట్లాడుతూ.

నేను చాలా ఎమోషనల్ అవుతాను.ఆ రోజు నేను చాలా ఏడుస్తానని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని తెలిపారు.ఇక ఇంటర్వ్యూలో తెలిపినట్టుగానే కూతురి వివాహ వేడుకలు చూసి ఎమోషనల్ అయ్యారు అమీర్ ఖాన్.కూతురి పెళ్లి అమీర్ కు చాలా ఎమోషనల్ మూమెంట్.ఐరా, నూపూర్ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు.పెళ్లి తర్వాత, అమీర్ ఖాన్, అతని మొదటి భార్య రీనా దత్తా, కుమార్తె ఐరా, కుమారుడు జునైద్, అల్లుడు నూపుర్ శిఖర్ , అతని తల్లి అందరూ కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు.

ఐరా-నుప్పూర్ మ్యూజిక్ ఫంక్షన్‌లో అమీర్ ఖాన్ తన మాజీ భార్య కిరణ్ రావు, కుమారుడు ఆజాద్‌తో కలిసి ఒక ప్రత్యేక పాట కూడా పాడారు.ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube