సాధారణంగా చిన్న యాక్సిడెంట్ జరిగినా మనం ఎంతో భయపడిపోతుంటాం.ట్రైన్స్ నడిపే వారు కూడా ఏవైనా భారీ వాహనాలను ముందుకు వచ్చి యాక్సిడెంట్స్ అయితే వణికి పోతారు.
కానీ ఒక లేడీ లోకో పైలట్ ( Lady Loco Pilot ) మాత్రం ఒకేసారి పదుల సంఖ్యలో తన ట్రైన్ కి వచ్చి వాహనాలు గుద్దుకుంటూ యాక్సిడెంట్స్( Accidents ) జరుగుతున్నా ఏమాత్రం భయపడలేదు.తన గుండె రాయి అన్నట్లు ఆమె అలానే ముందుకు దూసుకు వెళ్లిపోయింది.
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసి చాలామంది ఆమె కొంచెం కూడా చెలించడం లేదు, ఆమె ప్రవర్తనను చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని కామెంట్లు చేస్తున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక మహిళ ట్రామ్( Tram ) లాంటి ట్రైన్ నడుపుతూ ముందుకు వెళ్లడం మనం చూడవచ్చు.ఈ లేడీ లోకో పైలట్ నగర మధ్యలో నుంచే వెళ్తోంది అదొక స్మాల్ ట్రైన్ లాగా అనిపిస్తుంది.ఈ చిన్న ట్రైన్ పట్టాలపై వెళ్తూ ఉంటే దానికి ఎదురుగా వాహనాలు( Vehicles ) వస్తూ ఉన్నాయి.దీనివల్ల ట్రైన్ వాటికి డాష్ ఇస్తోంది.ఆ సమయంలో ట్రైన్ చాలా కుదుపులకు లోనవుతోంది.అయినా ఈ లేడీ లోకో పైలట్ మాత్రం ఏం భయపడడం లేదు తనకి ఇలాంటి యాక్సిడెంట్ కాదన్నట్లు చాలా ప్రశాంతంగా రైలు ముందుకు నడుపుతూ వెళ్ళిపోతుంది.

ఈ దృశ్యాలు ట్రైన్ లోని సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి.ఇది ఎక్కడ జరిగింది ఎప్పుడు జరిగిందని వివరాలు తెలియ రాలేదు కానీ @NoCapFights ట్విట్టర్ పేజీ దీనిని తాజాగా షేర్ చేసింది.ఆ సమయం నుంచి విస్తృతంగా వైరల్ అవుతూ ఇప్పటికే 2 కోట్ల 44 లక్షలకు పైగా వ్యూస్ సంపాదించింది.దీనిపై మీరు కూడా ఒక లుక్కేయండి.







