మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం( Guntur Karam ) సినిమాకు సూపర్ పాజిటివ్ టాక్ వస్తుందని ఫ్యాన్స్ భావిస్తే యావరేజ్, అబవ్ యావరేజ్ టాక్ రావడం కొంతమందికి షాకిస్తోంది.కొన్ని తప్పులు చేయకుండా ఉండి ఉంటే మాత్రం గుంటూరు కారం మూవీ రేంజ్ మరింత పెరిగేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.
మహేష్( Mahesh Babu ) సినిమాకు పూర్తిస్థాయిలో న్యాయం చేయగా త్రివిక్రమ్( Trivikram ) చేసిన తప్పులు ఫ్యాన్స్ ను బాధ పెడుతున్నాయి.

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తోంది.ఇలాంటి సమయంలో రొటీన్ కమర్షియల్ సినిమాలను ప్రేక్షకులు ఆదరించే ఛాన్స్ తక్కువనే సంగతి తెలిసిందే.త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాతో అత్తారింటికి దారేది( Attarintiki Daredi ) సినిమాను గుర్తు చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
కథనం రొటీన్ గా కాకుండా సరికొత్తగా ఉండి ఉంటే మాత్రం ఈ సినిమా రేంజ్ ఊహించని స్థాయిలో పెరిగేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మహేష్ బాబు సినిమాలు అంటే ప్రేక్షకులకు కొన్ని అంచనాలు ఉంటాయి.కామెడీ,( Comedy ) బలమైన హీరోయిజం( Heroism ) మహేష్ బాబు ప్లస్ పాయింట్లు కాగా మహేష్ బాబును సరిగ్గా వాడుకోవడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ నిరాశపరిచారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.గుంటూరు కారం మూవీ మహేష్ బాబు వీరాభిమానులలో సైతం కొంతమందిని తీవ్రస్థాయిలో నిరాశకు గురి చేసింది.

త్రివిక్రమ్ దర్శకత్వం అంటే అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు.ఆ ఆశలను గుంటూరు కారం ఆవిరి చేసింది.త్రివిక్రమ్ ఒక సినిమాకు మరో సినిమాకు పోలికలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.సంక్రాంతి సినిమాలలో( Sankranti Movies ) పెద్ద సినిమా ఇదే కావడంతో కలెక్షన్ల విషయంలో మాత్రం ఈ సినిమా పైచేయి సాధించే ఛాన్స్ అయితే ఉంది.
గుంటూరు కారం మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు సైతం భారీ స్థాయిలోనే ఉండే అవకాశం ఉంది.







