తల్లి కోరికతో 13 ఏళ్ల బాలుడిని ఇంటర్న్‌గా నియమించుకున్న లూయిస్ విట్టన్..

ప్రముఖ ఫ్రెంచ్ కంపెనీ లూయిస్ విట్టన్ బ్యాగులు, బూట్లు, బట్టలు వంటి లగ్జరీ ప్రొడక్ట్స్‌ తయారు చేస్తుంది.ఈ ప్రొడక్ట్స్‌పై స్పెషల్ ప్యాట్రన్ ఉంటుంది కాబట్టి దానిని ప్రజలు సులభంగా గుర్తించగలరు.

 Louis Vuitton Hired A 13-year-old Boy As An Intern At His Mother S Request, Lo-TeluguStop.com

అయితే 13 ఏళ్ల వయస్సు గల మిలన్( Milan ) అనే యువకుడు తాను గీసే బొమ్మలు లూయిస్ విట్టన్‌ ప్రొడక్ట్స్‌పై సొంత డిజైన్స్ వేస్తున్నాడు.బూట్లు, ట్రాక్‌సూట్, దుస్తులపై వెరైటీగా డిజైన్స్ వేస్తూ తల్లిదండ్రులు ఆశ్చర్య పరుస్తున్నాడు.

రీసెంట్‌గా కొన్నిటిపై లూయిస్ విట్టన్‌ ప్రొడక్ట్స్‌( Louis Vuitton Products)ను గీసి వాటిపై సొంత డిజైన్లను వేశాడు వాటిని చూసి తల్లి ఎంత ఆశ్చర్యపడింది తర్వాత సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ఈ కుర్రోడు తన డ్రాయింగ్స్‌ను రియల్లిస్టిక్‌గా మార్చడానికి ఫోటోషాప్ అనే కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను ఉపయోగించాడు.మిలన్ తల్లి లూయిస్ ఒడెస్సా తన కొడుకు లూయిస్ విట్టన్‌తో కలిసి పని పనిచేయాలని కోరుకుంటున్నట్లు ఒక ట్వీట్ లో తెలిపింది.ఈ బాలుడి కుటుంబం కంపెనీ ఉన్న పారిస్‌లోనే నివసిస్తుంది.

ఆమె ఎక్స్‌ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో మిలన్ డ్రాయింగ్‌ల కొన్ని చిత్రాలను పోస్ట్ చేసింది.లూయిస్ విట్టన్‌ను ట్యాగ్ చేసి, వారి నుంచి నేర్చుకునే అవకాశాన్ని తన కుమారుడికి ఇవ్వాలని కోరింది.

తన కొడుకు తమ బ్రాండ్, లెదర్ పట్ల చాలా మక్కువ చూపుతాడని చెప్పింది.

ఒక వారం పాటు ఇంటర్న్‌షిప్ చేయనివ్వాలని ఆమె వారిని వేడుకుంది.డిసెంబర్ 14వ తేదీతో 14 ఏళ్లు నిండుకుంటున్నందున ఇది అతనికి గొప్ప పుట్టినరోజు కానుక అని ఆమె అన్నది.లూయిస్ విట్టన్ ఆమె పోస్ట్‌ని చూసి మిలన్ డ్రాయింగ్‌లను ఇష్టపడింది.

ఒక వారం ఇంటర్న్‌షిప్( Internship ) కోసం అతన్ని ఆహ్వానించాలని వారు నిర్ణయించుకున్నారు.వారు అతని ప్రతిభను, సామర్థ్యాన్ని చూడాలనుకున్నారు.

మిలన్ చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఉన్నాడు.అతను వారి ప్రధాన కార్యాలయానికి వెళ్లి వారి డిజైనర్లు, కళాకారుల నుంచి నేర్చుకున్నాడు.

అతను మరికొన్ని స్కెచ్‌లను రూపొందించాడు.తన సొంత డిజైన్‌తో బ్రీఫ్‌కేస్‌ను కూడా సృష్టించాడు.

అతను అక్కడ ఉన్నవాడిలా భావించాడు, ప్రతి క్షణం ఆనందించాడు.తన ఇంటర్న్‌షిప్ తర్వాత, అతను మీడియాతో మాట్లాడుతూ స్కూల్‌లో కంటే లూయిస్‌ విట్టన్‌లో తాను హ్యాపీగా ఉన్నానని చెప్పాడు.

తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు లూయిస్ విట్టన్‌కి కృతజ్ఞతలు తెలిపాడు, భవిష్యత్తులో మళ్లీ వారితో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube