అనంతపురం జిల్లా రాయదుర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా కబడ్డీ క్రీడాకారులు ఘర్షణకు దిగారు.
రెండు గ్రూపులకు చెందిన కబడ్డీ క్రీడాకారుల మధ్య వివాదం చెలరేగిందని తెలుస్తోంది.అయితే ఆటను ఆడే సమయంలో పాయింట్ల విషయంలో ఘర్షణ చెలరేగింది.
సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు.ఇరుజట్ల క్రీడాకారులను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.







