ప్రస్తుత కాలంలో కొంతమంది రైతులు ఉద్యానవన తోటలను సాగు చేస్తూ అందులో అంతర పంటలను సాగు చేసి అధిక ఆదాయం పొందుతున్నారు.కేవలం ఒకే పంటపై ఆధారపడితే నష్టాలు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
అదే అంతర పంటలను సాగు చేస్తే ఒక పంటలో నష్టం వస్తే మరొక పంటలో లాభం వస్తుంది.కాబట్టి రైతులు అంతర పంటలను సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ క్రమంలో ఆయిల్ ఫామ్ తోటలను సాగు చేసే రైతులు అందరం గా మొక్కజొన్న, బెండ లాంటి పంటలను సాగు చేస్తున్నారు.ఆయిల్ ఫామ్( Oil Palm ) తోటల వల్ల నాటిన మూడేళ్ల వరకు ఎలాంటి దిగుబడి రాదు.
తోటల మధ్యలో ఖాళీగా ఉండే స్థలంలో అంతర పంటలను సాగు చేస్తే.పెట్టుబడి తగ్గడంతో పాటు అదనపు ఆయాదాయం పొందవచ్చు.

ఆయిల్ ఫామ్ తోటలలో మొక్కల మధ్య మొక్కల వరుసల మధ్య అధిక దూరం ఉండేటట్లు నాటుకుంటారని తెలిసిందే.ఇక ఈ పంట నాటిన మూడేళ్ల తర్వాత దిగుబడులు రావడం మొదలవుతుంది.పొలంలో నీటి సౌకర్యం పుష్కలంగా ఉంటే వివిధ రకాల కూరగాయలు లేదా మొక్కజొన్న( Corn crop ) లాంటి పంటలు అంతర పంటలుగా సాగు చేయాలి.

పామ్ ఆయిల్ మొక్కల మధ్య 9 మీటర్ల దూరం, మొక్కల వరుసల మధ్య మూడు మీటర్ల దూరం ఉండేటట్లు నాటుకోవాలి.ఒక ఎకరం పొలంలో 45 పామ్ ఆయిల్ మొక్కలను నాటుకోవాలి.ఇక అంతర పంట గా ఎకరం పొలంలో బెండను సాగు( Lady finger crop ) చేయాలనుకుంటే.ఒక ఎకరాకు 3.5 కిలోల విత్తనాలు అవసరం.పంట కోసిన ప్రతిసారి మూడు క్వింటాళ్ల బెండ దిగుబడి పొందవచ్చు.ఒకవేళ మొక్కజొన్నను అంతర పంటగా సాగు చేస్తే మూడు టన్నుల దిగుబడి పొందవచ్చు.ఏ పంటను సాగుచేసిన దాదాపుగా లక్ష రూపాయల వరకు అదనపు ఆదాయం పొందవచ్చు.ఈ అదనపు ఆదాయం ప్రధాన పంటకు పెట్టుబడి పెట్టడానికి అవకాశం ఉంటుంది.







