ఫ్యామిలీని వెళ్లగొట్టిన కేఫ్ ఓనర్.. అయినా అతడినే పొగుడుతున్న నెటిజన్లు...

ఆస్ట్రేలియా( Australia )లో ఓ ఫ్యామిలీకి అవమానం జరిగింది.ఓ కేఫ్ ఓనర్ వారిని బయటకు గెంటేసాడు.

 The Cafe Owner Who Kicked Out The Family.. But The Netizens Are Praising Him, A-TeluguStop.com

ఈ సంగతి తెలిసిన నెటిజన్లు ఓనర్‌కే సపోర్ట్ చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే, ఇటీవల నలుగురు పిల్లలతో ఓ కుటుంబం ఆస్ట్రేలియాలోని ఓ కేఫ్‌కి వెళ్లింది.

ఆ సమయంలో పిల్లలు చాలా సందడి చేసి గొడవ చేశారు.చాలా సేపు కేకలు వేశారు.

వారి అల్లరి భరించలేక కేఫ్ యజమాని వారిని వెళ్లిపోవాలని కోరాడు, కానీ వారు వెళ్ళలేదు.పోలీసులను పిలుస్తానని చెప్పాడు.

దీంతో తల్లి కోపంతో ఊగిపోయింది.

Telugu Australia, Cafe, Latest, Nri-Telugu NRI

ఆమె కేఫ్‌ను వీడియో తీసి, అక్కడికి ఎవరూ వెళ్లవద్దని చెప్పింది.కేఫ్ ఓనర్( Cafe ) ప్రవర్తన అసహ్యంగా ఉందని ఆమె ఆరోపించింది.స్థానిక వార్తా కథనం వీడియోను చూపించింది.

వీడియోలో, పిల్లలు ఏడుపు వినవచ్చు.పిల్లలు హద్దులు దాటి బిహేవ్ చేశారని కేఫ్ యజమాని వార్తలకు తెలిపాడు.

డెజర్ట్‌ పంచుకోవాల్సిన సమయంలో తమకు పిచ్చి పట్టినట్లు గోల చేశారని చెప్పాడు.వారిలో ఒకరు నేలపై ఏదో విసిరారని అతను చెప్పాడు.

వారి శబ్దం ఇతర వినియోగదారులను ఇబ్బంది పెడుతుందని వాపోయాడు.వారిని 15 నిమిషాల పాటు ఆపేందుకు ప్రయత్నించానని, అయితే వారు ఆగలేదని వెల్లడించాడు.

కేఫ్ యజమాని చేసిన పని కుటుంబ సభ్యులకు నచ్చలేదు.అతను మొరటుగా, అన్యాయంగా ప్రవర్తించాడని వారు చెప్పారు.

Telugu Australia, Cafe, Latest, Nri-Telugu NRI

అయితే సోషల్ మీడియా( Social media )లో కొందరు కేఫ్ ఓనర్‌తో ఏకీభవించారు.అతను సరైన పని చేశాడని వారు సపోర్టివ్‌గా కామెంట్స్ చేశారు.తన కస్టమర్లు సంతోషంగా ఉండేలా చూసుకోవాలని వారు చెప్పారు.తమకు పిల్లలు కూడా ఉన్నారని, అలా ప్రవర్తించనివ్వబోమన్నారు.తల్లిదండ్రులు తమ పిల్లలకు ఇతరులను ఎలా గౌరవించాలో, ఎలా ప్రవర్తించాలో నేర్పించాలని చెప్పారు.ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకెళ్లకూడదని సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube