ఆపరేషన్ కాక్టస్( Operation Cactus ) .ఈతరం జనరేషన్ కి దీని గురించి పెద్దగా తెలియదు కానీ 20వ దశకంలో దీని గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ సాగింది ఎందుకంటే కేవలం ఐదు లక్షల జనాభా ఉన్న మాల్దీవులని కొంతమంది సైనికులు ఆక్రమించారు ఆ సమయంలో ఆపరేషన్ కాక్టస్ జరిపి వారి దేశాన్ని వారికే సురక్షితంగా అప్పచెప్పిన చరిత్ర మన భారతదేశానికి ఉంది.
భూతాపం పెరిగిపోతున్న ఈ పరిస్థితులలో ఏదో ఒక రోజు కచ్చితంగా మాల్దీవులు( Maldives ) అంతమైపోవడం ఖాయం.అయితే 1988 సమయంలో ఆ దీవికి అధ్యక్షుడిగా అబ్దుల్ గయూమ్ ఉన్నాడు.
శ్రీలంక యొక్క స్పీడ్ బోట్లను హైజాక్ చేసిన కొంతమంది కిరాయి సైనికులు అబ్దుల్ గయూమ్ నీ పట్టుకొని ఆ దీవిని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేశారు.

ఒక్కొక్కటిగా అన్ని ప్రభుత్వ భవనాలను ఆక్రమించుకుంటూ వెళ్తున్నారు.అధ్యక్షుడిని అతని భవనం నుంచి తప్పించి మరో చోటుకి తరలించారు.ఆ సమయంలో సహాయం చేయాల్సిందిగా పాకిస్తాన్ శ్రీలంక దేశాలను సదరు అధ్యక్షుడు దీనంగా అర్ధించిన వారు పట్టించుకోలేదు అలాగే అమెరికా , బ్రిటన్ ( America, Britain )వంటి దేశాలను కూడా సహాయం చేయాలని కోరాడు అబ్దుల్ గయుమ్.
ఏవో కుంటే సాకులు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు ఇక ఏ దిక్కు లేని పరిస్థితులలో ఇండియా ని కూడా అర్థించాడు.అప్పుడు ఇండియాకి భూటాన్ నేపాల్ ఎలా మిత్ర దేశంగా ఉన్నాయో మాల్దీవులను కూడా అలాగే మిత్ర దేశం గానే భావించేవారు పైగా అంతర్జలాలపై ఒక పట్టు సాధించాలంటే మాల్దీవులు కూడా కచ్చితంగా అవసరం.

దాంతో అర్ధించిన తొమ్మిది గంటల లోపే భారత్ ఆపరేషన్ కాక్టస్( India’s Operation Cactus ) పేరుపై ఒక సైన్యాన్ని తయారుచేసి పంపించారు.పారాషూట్స్ సహాయంతో మొదట ఎయిర్ పోర్ట్ నీ స్వాధీనం చేసుకొని తర్వాత అన్ని ప్రభుత్వ భవనాలను గ్రిప్ లోకి తెచ్చుకొని అధ్యక్షుడిని కూడా సేవ్ చేశారు.మొత్తం ఈ ఆపరేషన్ లో కిరాయి సైనికులతో పాటు వారు బంధించిన ఇద్దరు కూడా చనిపోగా మొత్తం మరణించిన వారి సంఖ్య కేవలం 19 మాత్రమే.కొంతమంది శ్రీలంకకి పారిపోగా వారిలో కొంతమందిని బంధించి ప్రభుత్వానికి అప్పచెప్పగా వారికి యావజీవ శిక్షలతో సరిపెట్టారు.
అయితే ఇప్పుడు మాత్రం చైనా( China ) అండ చూసుకొని ఇండియా ప్రభుత్వాన్ని అప్పుడప్పుడు వెక్కిరించడం, ఎద్దేవా చేయడం లాంటివి చేస్తూ వచ్చారు.ఇప్పుడు కూడా ప్రస్తుతం చైనా పర్యటనలోనే మాల్దీవుల అధ్యక్షుడు ఉండటం విశేషం.
కానీ మోడీ లక్షద్వీప్ ఐడియాతో కంగు తిన్న మాల్దీవుల అధ్యక్షుడు మరోమారు భారత్ ను అర్థించడానికి సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది.







