వ్యవసాయ పొలం తక్కువగా ఉండి, అధిక పెట్టుబడులు పెట్టలేని రైతులు కూరగాయ పంటలను సాగు చేయడం లాభదాయకంగా ఉంటుందని వ్యవసాయ క్షేత్ర నిపుణులు( Agricultural experts ) చెబుతున్నారు.అయితే కూరగాయ పంటలలో కూడా అంతర పంటలుగా వివిధ పంటలను సాగు చేస్తే అదనపు ఆదాయం పొందవచ్చు.
ఒక పంటలో నష్టం వచ్చిన మరొక పంట వల్ల ఆదాయం వస్తుంది.
క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలలో అంతర పంటగా కొత్తిమీర, ములంగి( Coriander, Radish ) పంటలను సాగు చేస్తే ఒక పంటను ఆశించిన తెగుళ్లు మరొక పంటకు ఆశించవు కాబట్టి మంచి ఆదాయం పొందవచ్చు.
పైగా కొత్తిమీర సాగు అతి తక్కువ సమయంలో చేతికి వస్తుంది కాబట్టి ఈ పంట ఆదాయం క్యాబేజీ, క్యాలీఫ్లవర్( Cabbage, cauliflower ) పంటలకు పెట్టుబడి అవుతుంది.

వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా కూరగాయల సాగు కాస్త కష్టమే.శీతాకాలంలో అయితే ఏ కూరగాయ పంటను సాగు చేసిన అధిక దిగుబడి పొందే అవకాశం ఉంటుంది.మామూలుగా క్యాబేజీ లేదా క్యాలీఫ్లవర్ పంటను సాగు చేస్తే.
మొక్కల మధ్య మొక్కల వరుసల మధ్య దూరంగా ఉండేటట్లు నాటుకుంటారు కాబట్టి నేలను కూడా చాలావరకు వృధాగా వదిలేయాల్సి ఉంటుంది.అలా కాకుండా అంతర పంటలను సాగు చేస్తూ పొలంలో ఎప్పటికప్పుడు కలుపు నివారణ చర్యలు చేపట్టాలి.

ఒక పంటను ఆశించిన చీడపీడలు కానీ, తెగుళ్లు కానీ మరొక పంటను ఆశించే అవకాశం చాలా తక్కువ.కాబట్టి ఒక పంట వల్ల నష్టం వస్తే మరొక పంట చేతికి వచ్చి ఆదుకుంటుంది.రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి పంట మార్పిడి చేయడం, ప్రధాన పంటలలో అంతర పంటలు సాగు చేయడం వల్ల రైతులు నష్టాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు రావు.కాకపోతే ఏ పంటను సాగు చేయాలి అనుకున్న ముందుగా ఆ పంట సాగు విధానంపై అవగాహన కల్పించుకున్న తర్వాత సాగు చేస్తే పెట్టుబడి వ్యయం కూడా కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.







