Trivikram Srinivas : చాలా ఏళ్లుగా సినిమాల విషయంలో త్రివిక్రమ్ వాడుతున్న సెంటిమెంట్ ఇదే !

రైటర్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత డైరెక్టర్ గా ఎదిగిన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్( Trivikram Srinivas ).ప్రస్తుతం టాలీవుడ్ లోనే మంచి మాటలు రచయితగా ఉండి అలాగే అత్యధిక హిట్లు అందుకున్న డైరెక్టర్ గా కూడా త్రివిక్రమ్ కి పేరు ఉంది.

 Why Triviram Follows Multiple Heroines Sentiment-TeluguStop.com

అయితే త్రివిక్రమ్ సినిమాల విషయానికి వచ్చేసరికి అనేక సెంటిమెంట్స్ ని ఫాలో అవుతూ ఉంటాడు.అందులో ఈరోజు ఒక సెంటిమెంట్ గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఆ సెంటిమెంట్ ఏంటి అంటే దాదాపు జల్సా సినిమా( Jalsa movie ) నుంచి ఇప్పుడు వస్తున్న గుంటూరు కారం సినిమా వరకు త్రివిక్రమ్ చాలా చిత్రాల్లో దాదాపు ఇద్దరు హీరోయిన్స్ ని పెట్టి సినిమాలో తీస్తూ వస్తున్నాడు.

Telugu Ileana, Jalsa, Multiple, Parvathy Melton, Praneetha, Samantha, Tollywood-

అలా పెట్టడానికి కారణం ఏంటా అని ఆరా తీస్తే చాలామంది ఎక్కువ సేపు ఒకే హీరో హీరోయిన్ తో ఆడి పాడుతుంటే చూడరట.హీరోయిన్ తో కాసేపు ఉన్న మరో హీరోయిన్ కూడా పెడితే ఒకే టికెట్ పై రెండు సినిమాలు చూసే అవకాశం ప్రేక్షకుడికి దక్కుతుంది.అలాగే ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది అని త్రివిక్రమ్ ఇలా చేస్తారనే విషయం తెలుస్తుంది.

జల్సా సినిమాలో మొట్టమొదటిసారిగా తన చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ వాడాడు.ఇలియానా మరియు పార్వతి మెల్టన్( Ileana , Parvathy Melton ) తో పాటు కమలినీ ముఖర్జీ కూడా ఈ చిత్రంలో ఉంది.

ఆ తర్వాత అత్తారింటికి దారేది సినిమా కోసం కూడా ఇద్దరూ హీరోయిన్స్ ని పెట్టుకున్నాడు త్రివిక్రమ్.సమంత ప్రణీత ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటించారు.

Telugu Ileana, Jalsa, Multiple, Parvathy Melton, Praneetha, Samantha, Tollywood-

S/o సత్యమూర్తి సినిమాలో సమంతతో పాటు నిత్య మీనన్, అదా శర్మ ఉన్నారు.నితిన్ హీరోగా వచ్చిన ఆ ఆ సినిమాలో సైతం సమంతతో పాటు అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటించారు.పవన్ కళ్యాణ్ మరో సినిమా అజ్ఞాతవాసిలో అను ఇమ్మానియేల్ తో పాటు కీర్తి సురేష్ హీరోయిన్స్ గా నటించారు.అరవింద సమేత వీర రాఘవ చిత్రంలో పూజా హెగ్డే తో పాటు ఈషా రెబ్బా హీరోయిన గా నటించింది.

అలా వైకుంఠపురం లో చిత్రంలో పూజా హెగ్డే తో పాటు నివేదా పేతురాజ్ నటించింది.ఇక తాజాగా థియేటర్లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్న గుంటూరు కారం సినిమాలో శ్రీ లీల తో పాటు మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube