ఏపీ సీఎం జగన్ పై ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని మండిపడ్డారు.
రాయలసీమ, ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులన్నీ నిలిచిపోయాయని ఎమ్మెల్యే గోరంట్ల ఆరోపించారు.టీచర్లు, పోలీసుల నియామకాలు జరగలేదని తెలిపారు.
కేంద్ర పథకాలకు జగన్ తన పేరు పెట్టుకుంటున్నారని విమర్శించారు.రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని తెలిపారు.
వైసీపీ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదని వెల్లడించారు.అలాగే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచే పోటీ చేస్తానని తెలిపారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో అన్ని స్థానాలు స్వీప్ చేస్తామని వెల్లడించారు.







