నేడు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టీ20.. భారత్ చరిత్ర సృష్టించేనా..!

భారత్( India ) లోని ముంబై వేదికగా భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా నేడు మూడవ టీ20 మ్యాచ్ ఉత్కంఠ భరితంగా జరుగనుంది.ఈ సిరీస్ లో ఇరుజట్లు చేరో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

 India Vs Australia Womwen Third T20 Today.. Will India Create History , Harmanpr-TeluguStop.com

కాబట్టి నేడు గెలిచే జట్టు సిరీస్ కైవసం చేసుకుంది.ఈ సిరీస్ లో తొలి మ్యాచ్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి, ఆస్ట్రేలియా( Australia ) ప్లేయర్లను పూర్తిస్థాయిలో కట్టడి చేసి అద్భుతమైన విజయం సాధించింది.

కానీ రెండవ మ్యాచ్ లో అదే జోరు కొనసాగించలేక ఘోరంగా ఓటమిని చవిచూసింది.

భారత మహిళల జట్టు సొంత గడ్డపై ఆస్ట్రేలియాపై టీ20 సిరీస్ ( T20 series )టైటిల్ సాధించడం అందని ద్రాక్ష పండు లాగా మిగిలిపోయింది.నేడు జరిగే మ్యాచ్లో భారత మహిళల జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టి అద్భుతమైన విజయం సాధించి సరికొత్త చరిత్ర సృష్టించాలని భావిస్తోంది.భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్( Harmanpreet Kaur ) ఒత్తిడిలో ఉంది.

ఈమధ్య జరుగుతున్న మ్యాచ్లలో తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక క్రీజులో ఇబ్బందులు పడుతోంది.

ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియా జట్టును పూర్తిస్థాయిలో కట్టడి చేయాలంటే.బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్( Fielding ) అన్ని విభాగాల్లో పూర్తిస్థాయిలో రాణించాల్సి ఉంది.గతంతో పోల్చుకుంటే భారత మహిళల జట్టు బౌలింగ్ మరియు ఫీల్డింగ్ లో కాస్త మెరుగుపడింది.

నేటి మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ రాణించడంతోపాటు బౌలింగ్, ఫీల్డింగ్ లలో భారత జట్టు ఎలాంటి తప్పిదాలు చేయకుండా రాణిస్తే భారత జట్టు మ్యాచ్లో విజయం సాధించి, సిరీస్ కైవసం చేసుకోగలుగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube