ఒక చెడ్డవాడిని పట్టించేందుకు సామాజిక బాధ్యతలు ఉన్న కొందరు ఎవరూ చెప్పకపోయినా బుద్ధుడికి వేస్తుంటారు.అలాంటి వారివల్ల నేరగాళ్లు పట్టుబడటమే కాక సమాజంలో నేరాలు కూడా తగ్గుతాయి.
అయితే తాజాగా ఒక డెలివరీ బాయ్( Delivery Boy ) చాలా ధైర్యం చేసి ఒక క్రిమినల్‌ను( Criminal ) పోలీసులకు పట్టించాడు.దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక డెలివరీ బాయ్ తన చేతిలో ఒక ప్యాకేజీ పట్టుకొని ఒక ఇంటి యజమానికి ఇవ్వడానికి వెళ్తున్నట్లు మనం చూడవచ్చు.అంతలోనే సమీపంలోని రోడ్డుపై ఒక కారు( Car ) అన్నిటిని గుద్దుకుంటూ రావడం గమనించాడు.
ఆ కారు వెనకే హారన్స్ తో రెండు పోలీస్ కార్లు( Police Cars ) దూసుకు రావడం కనిపించింది.తర్వాత మొదటి కారులో ఉన్న క్రిమినల్ ఆగిపోయాడు.
బహుశా అది ఒక డెడ్ ఎండ్( Dead End ) అయి ఉంటుంది.అతడు కారు ఆపేసి వెనక్కి తిరిగి పరిగెడదామని చూశాడు.
అయితే డెలివరీ బాయ్ ఆ దొంగను పట్టించాలని ముందు నుంచి అనుకుంటున్నాడు.

క్రిమినల్ పారిపోతుంటే అతడిని పోలీసులకు పట్టిద్దామని రోడ్డు వైపుగా నడుచుకుంటూ వెళ్ళాడు.తర్వాత కాలు అడ్డుపెట్టి ఆ క్రిమినల్ కింద పడేలా చేశాడు.కింద పడిన తర్వాత నేరగాడు వెంటనే లేవలేకపోయాడు.
ఆలోగా పోలీసులు ( Police ) అతడిని చేరుకొని చుట్టుముట్టారు.ఒకవేళ ఈ డెలివరీ బాయ్ తన కాలు అడ్డుపెట్టి క్రిమినల్‌ను పడేయకపోతే అతడు పోలీసుల నుంచి తప్పించుకునే వాడు.

అతడిని క్యాచ్ చేసేందుకు అధికారులు చాలా సమయం ఉరుకులు పరుగులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చేది.కానీ ఆ టైమ్ అంతా ఈ డెలివరీ బాయ్ సేవ్ చేశాడు.ఈ డెలివరీ బాయ్ ధైర్యాన్ని చాలామంది మెచ్చుకుంటున్నారు.ఇలాంటి పని చేసిన అతనికి ఏదైనా సన్మానం చేయాలని పోలీసులను కోరుతున్నారు.InternetHOF ట్విట్టర్ పేజీ షేర్ చేసిన దీనికి ఇప్పటికే 53 లక్షల పైగా వ్యూస్ వచ్చాయి.దీనిని మీరు కూడా చూసేయండి.







