భారత సంతతి నేత ఈశ్వరన్‌పై అవినీతి ఆరోపణలు.. ఆయనపై విచారణ ఆందోళనకరం : సింగపూర్ మంత్రి

భారత సంతతికి చెందిన సింగపూర్ రవాణా శాఖ మంత్రి ఈశ్వరన్‌పై( Singapore Transport Minister Iswaran ) అవినీతి ఆరోపణలు గతేడాది కలకలం రేపిన సంగతి తెలిసిందే.ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.

 Corruption Probe On Indian-origin Cabinet Colleague Worrying Singapore Minister-TeluguStop.com

ఈ ఆరోపణలు ఈశ్వరన్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గంపై పెను ప్రభావాన్ని చూపిందని అతని కేబినెట్ సహచరుడు వ్యాఖ్యానించారు.ఈశ్వరన్ నేతృత్వంలోని వెస్ట్‌కోస్ట్‌లోని( West Coast ) గ్రూప్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం (జీఆర్‌సీ)లోని పార్లమెంట్ సభ్యులు (ఎంపీ) జీవన వ్యయం, అసమానత వంటి కీలకమైన సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారని జాతీయ అభివృద్ధి మంత్రి డెస్మండ్ లీ( National Development Minister Desmond Lee ) చెప్పారు.

ఈశ్వరన్ అవినీతి కేసు గురించి గతేడాది జూలై నుంచి వార్తలు వెలువడ్డాయని, అయినప్పటికీ జట్టును కలిసికట్టుగా వుంచగలిగామన్నారు.వారికి ఉత్సాహం, అంకితభావంతో సేవ చేయడం కొనసాగించేందుకు శక్తినిచ్చామని డెస్మండ్ లీ పేర్కొన్నారు.

Telugu Corrupt Bureau, Nationaldesmond, Peoples, Iswaran, Singapore, Coast-Telug

ఈశ్వరన్‌ను 2023 జూలై 11న కరప్ట్ ప్రాక్టీసెస్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీపీఐబీ)( Corrupt Practices Investigation Bureau ) అరెస్ట్ చేయగా, బెయిల్‌పై విడుదలయ్యారు.ఆయన ప్రస్తుతం సెలవులో వుండగా.తదుపరి నోటీసు వచ్చే వరకు ఈశ్వరన్ నెలవారీ వేతనం 8,500 సింగపూర్ డాలర్లకు తగ్గించబడింది.అయినప్పటికీ తన ఎంపీ అలవెన్స్‌ను డ్రా చేస్తూనే వున్నారు.స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి సింగపూర్‌ను( Singapore ) పాలిస్తున్న పీపుల్స్ యాక్షన్ పార్టీలో (పీఏపీ) ఈశ్వరన్ పార్లమెంట్ సభ్యుడు.ఆయన 1997లో తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు.2006లో ఈశ్వరన్ మంత్రిగా నియమితులయ్యారు.

Telugu Corrupt Bureau, Nationaldesmond, Peoples, Iswaran, Singapore, Coast-Telug

రవాణా మంత్రిగా, కోవిడ్ సంక్షోభం తర్వాత సింగపూర్‌ను ఎయిర్ హబ్‌గా తీర్చిదిద్దడంలో ఈశ్వరన్ కీలకపాత్ర పోషించారు.అలాగే సింగపూర్ వాణిజ్య సంబంధాల ఇన్‌ఛార్జ్‌ మంత్రిగానూ వ్యవహరిస్తున్నారు.అలాంటి వ్యక్తి విచారణను ఎదుర్కొంటూ వుండటంతో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీపై( Peoples Action Party ) విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

సింగపూర్‌లో 2025లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.కానీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఎన్నికలు ముందుగానే నిర్వహించవచ్చు.1965లో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి సింగపూర్‌ను పీఏపీ పరిపాలిస్తోంది.

సింగపూర్‌ను ఫార్మూలా వన్ సర్క్యూట్‌లో భాగమయ్యేలా చేయడంలో ఈశ్వరన్, హోటల్ ప్రాపర్టీ లిమిటెడ్ ఎండీ ఓంగ్ బెంగ్ కీలక పాత్ర పోషించారు.

ఓంగ్ సింగపూర్ గ్రాండ్ ప్రిక్స్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.ఇది ప్రతి యేటా మెరీనా బే స్ట్రీట్ సర్క్యూట్‌లో ఎఫ్ 1 నైట్ రేసును నిర్వహిస్తున్నారు.2000లో ఈశ్వరన్ (ఆ సమయంలో జూనియర్ వాణిజ్య మంత్రి), ఓంగ్‌లు కలిసి అప్పటి ఫార్ములా వన్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నీ ఎక్లెస్టోన్‌ను సింగపూర్‌‌లో 2008లో ప్రారంభమయ్యే రేస్‌కు వేదికగా చేసేందుకు ఒప్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube