అప్పుడప్పుడు పేరెంట్స్ తమ పిల్లలను తక్కువ అంచనా వేస్తారు కానీ పిల్లలు ఊహించని తెలివితో తల్లిదండ్రులను కూడా ఆశ్చర్యపరుస్తుంటారు.ఇలాంటి స్మార్ట్ కిడ్స్( Smart kids ) కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచుగా వైరల్ అవుతుంటాయి.
తాజాగా ఆ తరహా వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న వీడియో ఓపెన్ చేస్తే ఒక టాయ్ షాప్ లో సుమారు మూడేళ్ల వయసున్న ఒక పిల్లోడు కనిపించడం మనం చూడవచ్చు.అతడి చేతిలో ఒక పెద్ద పియానో బొమ్మ( Piano toy ) ఉంది.అయితే తండ్రి “అంత పెద్ద గిఫ్ట్ ను నేను కొనివ్వను నీ ఒక్క చేతిలో పట్టేంత గిఫ్ట్ సెలెక్ట్ చేసుకో అదే కొనిస్తా” అని చెప్పాడు.
ఆ పియానో అక్కడ పెట్టి వేరేది చేతిలో పట్టేంత చిన్నది తీసుకోమని ఆదేశించాడు.దాంతో బాలుడు షెల్ఫ్ లోనుంచి తీసిన బాక్స్ మళ్లీ అందులోనే ఉంచేసాడు.తర్వాత అతను సింగిల్ హ్యాండ్ తో అదే పియానో టాయ్ బాక్స్ పట్టుకొని ఇది తన సింగిల్ చేతిలో పట్టింది కొనివ్వు అని అన్నాడు.దాంతో తండ్రి ఫ్యూజులు ఎగిరిపోయాయి.

తన కొడుకు స్మార్ట్ నెస్ చూసి అతడు ఆశ్చర్యపోయాడు.దీనికి సంబంధించిన వీడియోను కూడా తానే రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.@Somakazima అనే ట్విట్టర్ పేజీ దీనిని షేర్ చేసింది.ఈ వీడియోకు ఇప్పటికే 56 లక్షల దాకా వ్యూస్, లక్ష దాకా లైక్స్ వచ్చాయి.పిల్లల్లో క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ పెంచాలంటే ఈ తండ్రిలాగానే వారికి కొన్ని టెస్టులు పెట్టాలి అని ఒక వ్యక్తి అన్నాడు.పిల్లోడు సెకండ్లలోనే ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాడు అని మరి కొందరు సరదాగా పేర్కొన్నారు.
ఈ తెలివైన పిల్లోడికి ఆ పియానో కొనియాల్సిందే అని మరికొందరు అన్నారు.







