ఆ విషయంలో.. అల్ ఇండియా హీరోలలో ప్రభాసే నెంబర్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు( Tollywood Star Heroes )గా ఎంతోమంది మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.అయితే ప్రస్తుతం చాలామంది హీరోలు పాన్ ఇండియా స్టార్ హీరోలుగా గుర్తింపు పొందారు.

 Young Rebel Star Prabhas Number One Hero In Tollywood,prabhas ,salaar ,bollywood-TeluguStop.com

ఇలా పాన్ ఇండియా హీరోలు( Pan India Heroes )గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో ప్రభాస్, రాంచరణ్, ఎన్టీఆర్ , అల్లు అర్జున్ వంటి వారు ఉన్నారు.ఇక ఈ హీరోలకు కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి.


Telugu Salaar, Bollywood, Prabhas, Prashanth Neel, Ram Charan, Sharuk Khan, Toll

ఇక కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతోమంది స్టార్ హీరోలు పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే.ఇకపోతే ఇలా ఇండియన్స్ స్టార్స్ గా గుర్తింపు పొందినటువంటి వీరందరూ కూడా ప్రస్తుతం వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.తాజాగా పలు భాషా చిత్రాలలోని స్టార్ హీరోల సినిమా గురించి ఒక వార్త వైరల్ గా మారింది.ఇలా ప్రతి ఒక్క ఇండస్ట్రీలోనూ స్టార్ హీరోల సినిమాలు కొన్ని వందల కోట్ల కలెక్షన్స్ రాబడుతున్నాయి.

కానీ అందరిలో కల్లా సినిమాల కలెక్షన్ విషయంలో నెంబర్ వన్ హీరో ప్రభాస్ ( Prabhas ) అంటూ ఓ వార్త వైరల్ గా మారింది.


Telugu Salaar, Bollywood, Prabhas, Prashanth Neel, Ram Charan, Sharuk Khan, Toll

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలైనటువంటి షారుక్ ఖాన్ ప్రభాస్ విజయ్ ఎన్టీఆర్ రామ్ చరణ్ ఈ హీరోల గత ఐదు సినిమాల కలెక్షన్లకు సంబంధించినటువంటి ఒక వార్త వైరల్ గా మారింది.ఈ హీరోలందరూ గత ఐదు సినిమాల నుంచి ఎవరు ఎంత మొత్తంలో కలెక్షన్స్ రాబట్టారనే విషయానికి వస్తే.బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్( Shahrukh Khan) 2781 కోట్ల కలెక్షన్స్ రాబట్టారు.

ఇది ఈయన గత ఐదు సినిమాల కలెక్షన్స్.ఇక ఎన్టీఆర్( NTR ) 1849 కోట్ల కలెక్షన్స్ రాబట్టారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్( Ram Charan )1802 కోట్ల కలెక్షన్స్ రాబట్టారు ఇక కోలీవుడ్ హీరో విజయ్ దళపతి( Vijay ) 1764 కోట్ల కలెక్షన్స్ రాబట్టారు.


Telugu Salaar, Bollywood, Prabhas, Prashanth Neel, Ram Charan, Sharuk Khan, Toll

ఇకపోతే టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ప్రభాస్ (Prabhas) మాత్రం గత ఐదు సినిమాల కలెక్షన్స్ ఎంత అనే విషయానికి వస్తే ఈయన ఏకంగా 3651 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించారు.ఇలా ఈ విషయంలో కూడా ప్రభాస్ టాప్ లో ఉండడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే ప్రభాస్ నటించిన గత మూడు సినిమాలు కూడా భారీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకున్నాయి.

ఇలా ప్రభాస్ సినిమాలకు నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం తగ్గేదెలేదన్న రీతిలో కలెక్షన్స్ రాబట్టి నెంబర్ వన్ హీరోగా నిలవడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube