సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఇండియన్ చరిత్రలో ఎవరు ఎక్కువ హిట్స్ కొట్టారు అనే ఒక లెక్క తీస్తే అందులో మీ అంచనా ప్రకారం ఏ హీరో ఏ ఇండస్ట్రీ నటుడు ఉంటాడు చెప్పగలరా ? చాలామంది టాలీవుడ్ లో మా హీరోకి ఎక్కువ హిట్స్ ఉన్నాయి, లేదంటే బాలీవుడ్( Bollywood ) లో ఖాన్ ల హవ నడుస్తుంది కాబట్టి వారిలో ఎవరో ఒకరికి ఎక్కువ హిట్స్ ఉండి ఉంటాయి అని అందరూ అనుకుంటారు కానీ అసలు విషయం వేరే.ఇప్పటివరకు ఇండియన్ సినిమా చరిత్రలో 900 సినిమాల్లో హీరోగా నటించిన ఏకైక నటుడు ప్రేమ్ నజీర్( Prem Nazir ).
అతడు నటించిన సినిమాల్లో ఎక్కువగా 450 చిత్రాలు హిట్స్ కాక అందులో 50 చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్స్.
1950 నుంచి 89 వరకు దాదాపు 750 చిత్రాలకు పైగానే హీరోగా నటించాడు వయసు మలిన తర్వాత సపోర్టింగ్ పాత్రలో నటిస్తూ వచ్చాడు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఒక సినిమా విడుదల అయింది.ఆయన వయసు మల్లిన తర్వాత కూడా స్టార్ హీరోగా ఒక వెలుగు వెలగాలని కోరుకోలేదు. కొత్త నీరు వస్తుంది అని కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని తనంతట తానే ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నాడు.
తులత నాటకాలతో తన కెరియర్ని మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా ఒక వెలుగు వెలిగాడు.రొమాంటిక్, పౌరాణికం, చారిత్రకం, ట్రాజెడీ, యాక్షన్ అనే తేడా లేకుండా అన్ని జూనియర్స్ లో ఇరగదీసి హిట్ అనే పదానికి పర్యాయపదంగా మారాడు.
అమితాబ్ బచ్చన్ ( Amitabh Bachchan )లాంటి హీరోకి 46 హిట్స్ అలాగే షారుఖ్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ కి 30 కి పైగా హిట్స్.వందల్లో సినిమాల్లో నటిస్తున్న రజనీకాంత్ కి కూడా వందకు పైగా హిట్స్ లేవు.కానీ ప్రేమ్ నజీర్ మాత్రం తన హిస్టరీని మరెవరు రిపీట్ చేయనంత స్ట్రాంగ్ గా రికార్డు చేసుకున్నాడు.ఇలా ఏ ఇండియన్ హీరోస్ కి ఎవ్వరు కూడా దరిదాపుల్లో కూడా ఈ రికార్డు చేరుకోలేరు.1926లో పుట్టిన ప్రేమ్ నజీర్ 1989లో ఒక వ్యాధితో కన్నుమూశారు.