Niharika: అడవి మధ్యలో అపని చేసిన నిహారిక.. బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటూ పోస్ట్?

మెగా డాటర్ నిహారిక(Niharika) ప్రస్తుతం తన వృత్తిపరమైనటువంటి జీవితాన్ని అలాగే తన వ్యక్తిగత జీవితాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అనే సంగతి మనకు తెలిసిందే.ఈమె కెరియర్ మొదట్లో యాంకర్ గా అనంతరం హీరోయిన్గా ఇండస్ట్రీలో కొనసాగారు.

 Niharika Latest Instagram Story Goes Viral-TeluguStop.com

అయితే కెరియర్ పరంగా సక్సెస్ కాకపోవడంతో పెళ్లి చేసుకున్నారు.పెళ్లి జీవితంలో కూడా సక్సెస్ కాలేదని చెప్పాలి.

ఇలా భర్తకు విడాకులు ఇచ్చినటువంటి ఈమె తిరిగి ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో నటించిన నిహారిక నిర్మాతగా కూడా మారారు.

ఇలా ఈమె ప్రస్తుతం వెబ్ సిరీస్ లను నిర్మించడమే కాకుండా సినిమాలను కూడా నిర్మిస్తూ మరోవైపు హీరోయిన్గా కూడా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది.

ఇకపోతే నిహారిక ఎంతో బిజీగా ఉంటూనే సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.ఈమె తరచూ వెకేషన్ లకి( Vacations ) వెళ్లడం ఆ వెకేషన్ కి సంబంధించినటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడం జరుగుతుంది.

Telugu Jungle, Manchu Manoj, Niharika, Niharika Jungle, Niharikalatest, Tollywoo

ఈ క్రమంలోనే నిహారిక తన ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా కొన్ని ఫోటోలు వీడియోలను అభిమానులతో పంచుకున్నారు.ఇందులో భాగంగా ఈమె వెదరు (Bamboo) తో వివిధ రకాల వంట సామాగ్రిని తయారు చేసినటువంటి ఫోటోలను షేర్ చేసుకున్నారు.అదేవిధంగా అడవి మధ్యలో వేదురు బొంగులపై వంట( Cooking ) చేసినటువంటి ఫోటోలను కూడా ఇంస్టాగ్రామ్ స్టోరీ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Telugu Jungle, Manchu Manoj, Niharika, Niharika Jungle, Niharikalatest, Tollywoo

ఇందులో భాగంగానే అడవి మధ్యలో ఇలా వంట చేయడం ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని నాకు ఇలాంటి అనుభవం చాలా కాలం నుంచి ఉంది అంటూ ఈమె ఈ సందర్భంగా షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది.ఇలా నిహారిక స్వేచ్ఛ జీవిగా తనకు ఇష్టం వచ్చిన విధంగా ఎంజాయ్ చేస్తూ తనకు నచ్చిన ప్రదేశాలకు వెళ్తూ జీవితాన్ని గడుపుతున్నారని చెప్పాలి.ఇక ఈమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే మంచు మనోజ్( Manchu Manoj ) హీరోగా నటిస్తున్న వాట్ ది ఫిష్( What The Fish ) అనే సినిమాలో కూడా నిహారిక నటిస్తున్నారని తెలుస్తోంది.

Telugu Jungle, Manchu Manoj, Niharika, Niharika Jungle, Niharikalatest, Tollywoo

నిహారిక పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఈమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.అదేవిధంగా ఈమె ఒక పూర్తిస్థాయి తెలుగు సినిమాని కూడా నిర్మించబోతున్నారని తెలుస్తుంది.ఈ సినిమాకు సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి.త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube