టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కేవలం హీరోగా మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సంగతి మనకు తెలిసిందే.నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ప్రస్తుతం తాను కమిట్ అయినటువంటి సినిమాలన్నింటికీ కాస్త బ్రేక్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై పూర్తి ఫోకస్ పెట్టారు మరికొన్ని రోజులలో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఈయన ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నారు.

ఇలా రాజకీయాలలోనూ సినిమాలలోను కొనసాగుతూ ఉన్నటువంటి ఈయన ఎన్నో సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈయన సేవలను గుర్తించి తమిళనాడుకు చెందినటువంటి వేల్స్ యూనివర్సిటీ (Vels University) పవన్ కళ్యాణ్ ను డాక్టరేట్ కి ఎంపిక చేసింది ఈ నెలలో జరగబోయే 14వ కాన్వకేషన్ కు హాజరై ఆయన డాక్టరేట్(Doctorate) అందుకోవాలని యూనివర్సిటీ పవన్ కళ్యాణ్ కు సమాచారం అందజేశారు.అయితే ఈ విషయంపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేసినప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం అందరికీ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు.

ఈ సందర్భంగా వేల్స్ యూనివర్సిటీకి పవన్ కళ్యాణ్ లేఖ రాస్తూ తనను వేల్స్ యూనివర్సిటీ ఇలాంటి గౌరవ డాక్టరేట్ కు ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.అయితే ఈ గౌరవ డాక్టరేట్ తాను అందుకోలేనని ఎందుకంటే నాకంటే ఎంతో గొప్ప గొప్ప పనులు చేసిన వారు చాలామంది ఉన్నారని ఆ డాక్టరేట్ వారికి ఇవ్వాలని ఈయన కోరుతూ తిరిగి వేల్స్ యూనివర్సిటీకి లేఖ రాశారు.అంతేకాకుండా ఈ కార్యక్రమానికి తాను రాలేనని ప్రస్తుతం తాను ఎన్నికల హడావిడిలో ఉన్నట్లు ఈయన తెలియజేశారు.
ఇలా ఈయనకు డాక్టరేట్ అందుకోవాలని గౌరవం ఇచ్చినప్పటికీ ఈయన మాత్రం చాలా సున్నితంగా రిజెక్ట్ చేశారని తెలుస్తోంది.







