ఏపీలో వచ్చే ఎన్నికల్లో ఒంగోలు నుంచే పోటీ చేయనున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Balineni Srinivasa Reddy ) తెలిపారు.సామాజిక సమీకరణాల నేపథ్యంలోనే ఎమ్మెల్యే స్థానాల మార్పని పేర్కొన్నారు.
గిద్దలూరు( Giddalur ) నుంచి పోటీ చేస్తున్నానన్న వార్తలో నిజం లేదని బాలనేని స్పష్టం చేశారు.అదేవిధంగా పార్టీ మారుతున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు.టీడీపీ నాయకులతో ఉన్నానన్నది కూడా అవాస్తవమని తేల్చి చెప్పారు.తాను రాజకీయాల్లో ఉన్నంత వరకూ సీఎం జగన్( CM Jagan ) తోనే ఉంటానని తెలిపారు.ఎంపీ మాగుంట( Magunta Sreenivasulu Reddy ) విషయం సీఎం జగన్ తో మాట్లాడుతానని చెప్పారు.అలాగే సీఎం జగన్ నిర్ణయమే శిరోధార్యమని తెలిపారు.