జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాష్( Mukku Avinash ) గురించి మనందరికీ తెలిసిందే.జబర్దస్త్ షోలో తనదైన శైలిలో కామెడీ చేసి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు అవినాష్.
జబర్దస్త్ షో ద్వారానే బాగా పాపులర్ అయ్యారు.తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను అలరించడంతో పాటు అప్పుడప్పుడు వెండితెరపై సినిమాలలో కూడా మెరుస్తూ ఉంటాడు.
అయితే మొన్నటి వరకు జబర్దస్త్ షోలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను అలరించిన అవినాష్ ప్రస్తుతం జబర్దస్త్ షో కి దూరమైన విషయం తెలిసిందే.ప్రస్తుతం శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్న స్టార్ మా విత్ పరివారం( Star Maa Parivaram ) అనే షోలో చేస్తున్నాడు.

ఇటీవలే అవినాష్ ఒక ఇంటివాడైన విషయం తెలిసిందే.త్వరలో తండ్రి కూడా కాబోతున్నాడు.అలా ప్రస్తుతం పండుగ ఈవెంట్లు స్పెషల్ ఈవెంట్లు షోలు అంటూ బాగానే సంపాదిస్తున్నాడు అవినాష్.కాగా అవినాశ్ బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులకు మరింత చేరువ అయిన విషయం కూడా మనందరికీ తెలిసిందే.
nకానీ ఒకప్పుడు ఇండస్ట్రీకి రాకముందు వచ్చిన తర్వాత ఎన్నో రకాల కష్టాలను ఎదుర్కొన్నాడు.బిగ్ బాస్ లో పాల్గొన్న సమయంలోనూ తాను ఎదుర్కొన్న కష్టాలగురించి చెప్పుకొచ్చాడు అవినాష్.
తాజాగా అవినాష్ తమ్ముడు మాట్లాడుతూ.ఎమోషనల్ అయ్యాడు.కరోనా లాక్ డౌన్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము.

అప్పుడే మేము ఇల్లు కారు, కొనుకున్నాము.కానీ ఇంతలోనే లాక్ డౌన్ అవ్వడంతో షూటింగ్స్ కూడా లేవు.దాంతో చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా పోయింది.
ఈఎమ్ఐలు కట్టమని నోటీసులు వచ్చేవి.అవికాక బయట అప్పులు కూడా ఉన్నాయ్ దాంతో అన్న చాలా కుంగిపోయాడు అని తెలిపాడు.
అన్న ఎప్పుడు నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉండేవాడు.రోజుకు 5 గంటలు కూడా నిద్రపోయేవాడు కాదు.
ఎప్పుడు డబ్బుల గురించి, ఒత్తిళ్ల గురించే ఆలోచించే వాడు అని తెలిపాడు.

అప్పుల వల్ల ఫ్యాన్ కు ఉరేసుకొని చనిపోదాం అనుకున్నాడు.ఆ విషయం నాతో చెప్పుకున్నాడు అని తెలిపాడు అవినాష్ సోదరుడు.అప్పుడే బిగ్ బాస్ ఆఫర్ రావడంతో 10 లక్షలు కట్టి జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశాడు.
ఆ సమయంలో శ్రీముఖి( Sreemukhi ) దగ్గర 5 లక్షలు, గెటప్ శ్రీను దగ్గర ఒక లక్ష, చమ్మక్ చంద్ర దగ్గర రెండు లక్షలు అప్పు చేసి అవి జబర్దస్త్ కు కట్టాడు.దేవుడి దయ వల్ల ఇప్పుడు బాగానే ఉన్నాడు అని చెబుతూ ఎమోషనల్ అయ్యారు అవినాష్ సోదరుడు.