శివ కంఠమనేని హీరోగా నటించిన కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాఘవ రెడ్డి'( Raghava Reddy ).ఆయన సరసన సీనియర్ హీరోయిన్ రాశి నటించారు.యంగ్ హీరోయిన్ నందిత శ్వేతా ప్రధాన పాత్ర పోషించారు.ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తి పెంచాయి.ఇంతకీ, సినిమా ఎలా ఉందో చూద్దాం.
సినిమా: రాఘవ రెడ్డినటీనటులు: శివ కంఠమనేని( Shiva Kantmaneni ), రాశి, నందిత శ్వేతా, అన్నపూర్ణమ్మ, రఘుబాబు, పోసాని కృష్ణ మురళి, అజయ్, అజయ్ ఘోష్, ప్రవీణ్, శ్రీనివాసరెడ్డి, బిత్తిరి సత్తి తదితరులుఛాయాగ్రహణం: ఎస్.ఎన్.హరీష్!సంగీతం: సంజీవ్ మేగోటి – సుధాకర్ మారియోనిర్మాతలు: K.S.శంకర్ రావ్, G.రాంబాబు యాదవ్, R.వెంకటేశ్వర్ రావుకథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సంజీవ్ మేగోటి
రేటింగ్: 3/5
శివ కంఠమనేని కథానాయకుడిగా నటించిన ‘రాఘవరెడ్డి’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.గతేడాది ‘మధురపూడి అనే గ్రామంలో’, అంతకు ముందు కొన్ని కమర్షియల్ సినిమాలు చేశారు. ‘రాఘవరెడ్డి’లో శివ కంఠమనేని భార్యగా రాశి, కుమార్తెగా నందిత శ్వేతా నటించడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది.ఇంతకీ సినిమా ఎలా ఉందో చూద్దాం.
కథ:
రాఘవరెడ్డి (శివ కంఠమనేని) విశాఖలోని ఓ కాలేజీలో ప్రొఫెసర్.దోషులను పట్టుకోవడంలో, నిర్దోషులకు శిక్ష పడకుండా చూడటంలో పోలీసులకు సహాయ పడుతుంటాడు.క్రైమ్ సీన్( Crime Scene ) చూసి మర్డర్ ఎలా జరిగిందో చెప్పగల ఘనాపాటి రాఘవరెడ్డి.
పని తప్ప మరొక ధ్యాస ఉండదు.భార్య జానకి (రాశి) డెలివరీ రోజు కూడా కేసు విషయమై పోలీసుల దగ్గరకు వెళతాడు.దాంతో విడాకులు తీసుకుని, కుమార్తెతో వేరే ఊరు వెళుతుంది.18 ఏళ్ళ తర్వాత విశాఖలో మళ్ళీ రాఘవరెడ్డికి జానకి కనబడుతుంది.కానీ, కుమార్తె కనిపించదు.రాఘవరెడ్డి పాఠాలు చెబుతున్న కాలేజీలో అతని కుమార్తె మహాలక్ష్మి (నందిత శ్వేతా) జాయిన్ అవుతుంది.ఆమె ప్రవర్తన చూసి రాఘవరెడ్డి కోప్పడతాడు కూడా! తన కుమార్తె అని తెలిసేసరికి మహాలక్ష్మి కిడ్నాప్ అవుతుంది.
మహాలక్ష్మిని కిడ్నాప్ చేసింది ఎవరు? రాఘవరెడ్డి కారణంగా శిక్ష పడిన నేరస్థులా? లేదంటే వేరొకరా? కిడ్నాపర్లను రాఘవరెడ్డి ఎలా పట్టుకున్నాడు? కుమార్తెతో భర్తకు దూరంగా ఉంటున్న జానకి మళ్ళీ దగ్గర అయ్యిందా? లేదా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
కమర్షియల్ సినిమాలు ప్రేక్షకులకు కొత్త కాదు.అయితే ఇటీవల ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు.కమర్షియల్ హీరో క్యారెక్టర్ రెగ్యులర్ అండ్ రొటీన్ అయితే ఆదరించడం లేదు.సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్, లోకనాయకుడు కమల్ హాసన్ విక్రమ్, నరసింహం బాలకృష్ణ భగవాన్ కేసరి సినిమాలు విజయాలు సాధించడానికి ముఖ్య కారణం హీరోలు తమ వయసుకు తగ్గ పాత్రలు చేశారు.రాఘవరెడ్డి సినిమాలో కూడా శివ కంఠమనేని తన వయసుకు తగ్గ పాత్ర చేశారు.18 ఏళ్ల అమ్మాయికి తండ్రిగా కనిపించారు.కమర్షియల్ హీరోకి ఏమాత్రం తక్కువ కాదన్నట్లు ఫైట్స్, డాన్స్, ఎమోషనల్ సీన్స్ చేశారు.
కమర్షియల్ విలువలతో కూడిన కొత్త తరహా కథ రాఘవరెడ్డి అని చెప్పాలి.
హీరో హీరోయిన్ల మధ్య రొటీన్ లవ్ సీన్స్, డ్యూయెట్స్ లేవు.స్ట్రైట్ గా హీరో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసి కథలోకి తీసుకు వెళ్లారు.
అయితే కథలో లాజిక్స్ మిస్ అయ్యారు.స్క్రీన్ ప్లే మీద ఇంకా వర్క్ చేయాల్సింది.
సెంటిమెంట్ సీన్లు బాగా డీల్ చేసిన దర్శకుడు కథ మీద ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది.నిర్మాణ విలువలు పర్వాలేదు.
కథపై నమ్మకంతో బాగా ఖర్చు చేశారు.
కాలేజీకి వెళ్లి అల్లరి చేసే ఈతరం అమ్మాయిగా నందిత శ్వేతా( Nandita Swetha ) నటన బాగుంది.మోడరన్ గర్ల్ క్యారెక్టర్ పర్ఫెక్ట్ గా చేశారు.తల్లి పాత్రలో రాశి ఒదిగిపోయారు.
అన్నపూర్ణమ్మ, రఘుబాబు, పోసాని, ప్రవీణ్ తదితరులు అనుభవం అంతా రంగరించి ఆయా క్యారెక్టర్లలో చక్కగా చేశారు.పాటలు బాగున్నాయి.
ఐటమ్ సాంగ్ మాస్ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేస్తుంది.ఆ సాంగ్ చేసిన అమ్మాయి గ్లామర్ షోకి ఏ మాత్రం వెనకాడలేదు.
కమర్షియల్ సినిమా( Commercial Movie )లలో కొత్తదనం కోరుకునే ప్రేక్షకులను రాఘవరెడ్డి ఆకట్టుకుంటుంది.ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళితే ఎంటర్టైన్ అవుతారు.