హైవేపై మూర్ఖంగా టర్న్ తీసుకున్న లేడీ రైడర్.. ఎంత పెద్ద ప్రమాదం జరిగిందో చూడండి..

రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు సేఫ్టీకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే మన ప్రాణాలు లేదా ఇతరుల ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.

 Lady Scooty Rider Took A Stupid Turn On The Highway Leads To Big Accident Detail-TeluguStop.com

ఈ విషయం తెలిసినా కొందరు మాత్రం చాలా నిర్లక్ష్యంగా దూకుడుగా రోడ్లపై ప్రయాణాలు చేస్తూ ప్రమాదాలకు కారణమవుతుంటారు.తాజాగా ఒక యువతి( Woman ) కొంచెం కూడా బాధ్యతగా వ్యవహరించకుండా పెద్ద ప్రమాదానికి దారి తీసింది.

దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

వైరల్ అవుతున్న వీడియోలు టీ జంక్షన్ లాంటి ఒక ఇంటర్ సెక్షన్ రోడ్డులో( Intersection Road ) ఓ యువతి స్కూటర్ ( Scooter ) మీద వెళ్లడం మనం చూడవచ్చు.

అదొక పెద్ద హైవే లాగా కనిపిస్తోంది.దానిపై ట్రక్కులు, పెద్ద పెద్ద లారీలు వేగంగా వెళ్తున్నాయి.ఇదే రోడ్డులో ఒక పక్క సైడ్‌ వెళ్తున్న యువతి సడన్‌గా లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తీసుకోవడం మొదలుపెట్టింది.అయితే ఆమె లైన్‌లోనే చాలా వేగంగా వస్తున్న ట్రక్ డ్రైవర్( Truck Driver ) దీనిని ఊహించలేకపోయాడు.

అప్పటికే ఆ ట్రక్కు యమ స్పీడ్ గా వస్తోంది.బ్రేక్ చేస్తే కింద పడిపోయే ప్రమాదం ఉందని, అలాగే వెళ్ళిపోతే యువతిని ఢీ కొట్టడం ఖాయమని డ్రైవర్ భయపడిపోయాడు.చివరికి షార్ప్‌గా స్టీరింగ్ పక్కకి తిప్పేశాడు.అయితే అంత వేగంలో ఒకేసారి ట్రక్కు టర్నింగ్ తీసుకోలేకపోయింది.అది ఒక్కసారిగా అడ్డంగా తిరిగేసి కింద పడిపోయింది.ఆ యువతిని కూడా ఢీ కొట్టింది, చివరికి యువతి ఆ ట్యాంకర్ ట్రక్కు కింద పడిపోయింది.

ఈ ఘటనలో ఆమె చనిపోయిందా లేదా తీవ్ర గాయాలతో బయటపడిందా అనేది తెలియ రాలేదు.వెనక ఏమొస్తుందో చూసి రోడ్డుపై టర్నింగ్ తీసుకున్నట్లయితే బాగుండేది కానీ ఈ యువతి కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా ప్రవర్తించింది.ఫలితంగా తనప్రాణాలనే కాకుండా ట్రక్కులో ఉన్న వారి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసింది.యునాన్ ప్రావిన్స్‌లోని( Yunnan Province ) లింకాంగ్‌లోని హెహై వంతెన జెన్‌కింగ్ లైన్ కూడలి వద్ద ఈ యాక్సిడెంట్ చోటు చేసుకున్నట్లు ఒక నెటిజన్ వెల్లడించాడు.ఇందులో ఎవరూ చనిపోలేదని తెలిపాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube