ఐసీసీ తాజాగా టీ20 వరల్డ్ కప్( T20 World Cup ) షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది.ఈ ఏడాది జూన్ 1 నుంచి మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి.1 నుంచి 18 వరకు గ్రూప్ స్టేజ్, 19 నుంచి 24 వరకు సూపర్ 8, 26 నుంచి 27 వరకు సెమీ ఫైనల్స్, 29న ఫైనల్ మ్యాచ్ జరగనుంది.ఈ టోర్నీలో భారత్ -పాకిస్తాన్( India – Pakistan ) మధ్య జూన్ 9న న్యూయార్క్ వేదికగా మ్యాచ్ జరగనుంది.
కాగా వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా వరల్డ్ కప్ నిర్వహించనున్నాయి.ఈ టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొంటుండగా 4 గ్రూపులుగా విభజించారు.

గ్రూప్- A: ఇండియా, పాకిస్తాన్, ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ, గ్రూప్-B: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్, గ్రూప్-C: న్యూజిలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్, ఉగాండా, పపువా న్యూగినియా, గ్రూప్-D: సౌతాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్.కాగా ఇండియా తన తొలి మ్యాచ్ జూన్ 5న ఐర్లాండ్ తో తలపడనుంది.ఆ తర్వాత 9న పాకిస్తాన్, 12న యూఎస్ఏ, 15న కెనడాతో పోటీ పడనుంది.భారత్ ఆడే అన్ని మ్యాచ్ లు రాత్రి 8.30 గంటలకు ప్రారంభం కానున్నాయి.2007లో మొదలైన టి20 వరల్డ్ కప్ టోర్నీలో మొదట కప్పు ధోని సారథ్యంలో ఇండియా గెలిచింది.ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇండియా గెలవలేదు.2022లో సెమీఫైనల్ దాకా వెళ్లిన ఇండియా.ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలైంది.అయితే ఈసారి ప్రపంచ కప్ టోర్నీలో ఫుల్ ఫామ్ లో ఉన్న ఇండియా.కచ్చితంగా టీ20 కప్పు గెలిచే అవకాశాలు ఉన్నాయి అని క్రీడా విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.







