కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళల ఉచిత ప్రయాణానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలిపారు.
ఉచిత ప్రయాణాలపై మహిళలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని జగ్జారెడ్డి పేర్కొన్నారు.ఆరు గ్యారెంటీలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు.
కేటీఆర్, హరీశ్ రావు బెంజ్ కార్లలో తిరుగుతుంటే ప్రజల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు.తమది ప్రజా ప్రభుత్వమని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నేతలు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.







