టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా పలు సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రాజీవ్ కనకాల (Rajeev Kanakala) ఒకరు.ఈయన ఎన్నో సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇప్పటికి వరుస సినిమాలలో నటిస్తూ ఈయన కెరియర్ తరంగా ఎంతో బిజీ అవుతున్నారు.అయితే ఇటీవల కాలంలో రాజీవ్ కనకాల అధిక శరీర బరువు (Over Weight) పెరిగిన సంగతి మనకు తెలిసిందే.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన తన శరీర బరువు గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.

తాను అధిక శరీర బరువు పెరగడానికి మరే కారణం లేదు ఒకసారి ఫుడ్ పాయిజన్ (Food Poison) కావడంతో హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వచ్చింది.అప్పుడు నాకు సైలెన్స్ ఎక్కించేవారు.అలాగే ఇంటి నుంచి కూడా నాకు ఫుడ్ వచ్చేది అదే విధంగా హాస్పిటల్ వాళ్ళు కూడా నాకు ఫుడ్ ఇచ్చేవారు.
ఇలా ఫుడ్ వేస్ట్ చేయకుండా బాగా తినే వాడినని తెలియజేశారు.ఇక హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఫుడ్ విషయంలో నేను చాలా ఎక్కువగా తిన్నానని ప్రతి రోజు అరకిలో వరకు స్వీట్స్( Sweets ) తినేవాడిని అంటూ రాజీవ్ వెల్లడించారు.

ఇలా ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్లే నేను శరీర బరువు పెరిగానని ఈయన తెలిపారు.ఇక ఫుడ్ తినేటప్పుడు ఎవరైనా చాలు అనే మాట నన్ను అంటే కనుక నాకు చాలా కోపం వస్తుంది అందుకే నేను తినేటప్పుడు ఎవరూ కూడా తనకు అడ్డు చెప్పరని ఈయన వెల్లడించారు.అయితే అధిక శరీర బరువు పెరగటం వల్ల ఒక్కోసారి నడవలేకపోతున్నానని కాళ్లు కూడా వణుకుతున్నాయని ఈయన తెలిపారు అందుకే శరీర బరువు తగ్గాలని నిర్ణయించుకొని ప్రస్తుతం తాను శరీర బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నానని రాజీవ్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







