సంక్రాంతి పండుగకు 4,484 ప్రత్యేక బస్సులు: ఆర్టీసీ ఎండి సజ్జనార్

నల్లగొండ జిల్లా:సంక్రాంతి పండుగకు సొంతూళ్ల‌కు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ శుభ‌వార్త ప్రకటించింది.ప్ర‌త్యేకంగా 4,484 బ‌స్సుల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపింది.

 4,484 Special Buses For Sankranti Festival: Rtc Md Sajjanar-TeluguStop.com

జనవరి 6 నుంచి 15 వరకూ ఈ సర్వీసులు అందుబాటులో ఉండ‌నున్నాయి.హైదరాబాద్( Hyderabad ) నుంచి ఏపీ,కర్ణాటక, మహారాష్ట్రలకు సర్వీసులు నడిపేలా ఆర్టీసీ అధికారులు ప్లాన్ చేశారు.

ప్రత్యేక సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వర్తిస్తుందని కూడా చెప్పారు

.చార్జీ పెంపు లేకుండానే ప్రత్యేక బస్సులు( Special buses ) ఏర్పాలు చేసినట్టు ఎండీ స‌జ్జ‌నార్( VC Sajjanar ) చెప్పారు.ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగనీయమన్నారు.ఉప్పల్ క్రాస్ రోడ్,ఎల్‌బీ నగర్, ఆరాంఘర్,కేపీహెచ్‌బీ తదితర రద్దీ ప్రాంతాల్లో ఆర్టీసీ ప్రయాణికులకు ప్రత్యేక క్యాంపులు కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

బస్‌భవన్, మహాత్మాగాంధీ బస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ సెంటర్ల నుంచి రద్దీ ప్రాంతాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుంటామని అన్నారు.ప్రయాణికులు త్వరగా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు వీలుగా టోల్‌ప్లాజాల వద్ద ఆర్టీసీ బస్సుల కోసం ప్రత్యేక లేన్లు ఏర్పాటు చేశామని తెలిపారు.

అధిక చార్జీలు చెల్లించి ప్రజలు ప్రైవేటు బస్సుల్లో ప్రయాణించనక్కర్లేదని,ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆర్టీసీ ఎండి సజ్జనార్ సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube