వైసీపీలో నియోజకవర్గ ఇన్చార్జిల మార్పు లు చేపట్టి పెద్ద కలకలం సృష్టిస్తున్నారు వైసిపి అధినేత ఏపీ సీఎం జగన్.గెలుపే ప్రామాణికంగా టికెట్ల కేటాయింపు చేస్తూ కొత్త ఇన్చార్జిలను నియమిస్తున్నారు.
గెలిచే అవకాశం లేదనుకున్న వారిని పక్కన పెట్టేస్తున్నారు.వారిలో తనకు అత్యంత సన్నిహితులైన వారు ఉన్నా, సీనియర్ నేతలైనా, జగన్( YS Jagan Mohan Reddy ) పట్టించుకోవడం లేదు.
జగన్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై టికెట్ దక్కని వారు కొంతమంది సానుకూలంగా స్పందిస్తున్నా, మరి కొంతమంది మాత్రం ప్రత్యామ్నాయం చూసుకుంటున్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు( Malladi Vishnu )కు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదనే విషయాన్ని జగన్ క్లారిటీ ఇచ్చారు.

విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్( Vellampalli Sriniva ) కు బాధ్యతలు అప్పగించారు.దీంతో అసంతృప్తికి గురైన విష్ణు వైసీపీని వీడాలి అని నిర్ణయించుకున్నట్లు సమాచారం.షర్మిల( YS sharmila ) నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆయన ప్లాన్ చేసుకుంటున్నట్లు విష్ణు సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.కాంగ్రెస్ లో చేరితే ఆయనకు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించడంతో పాటు , నగర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలను అప్పగించేందుకు కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు… ఆ హామీ మేరకు కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈ మేరకు బుధవారం తన అనుచరులతో మల్లాది విష్ణు సమావేశం అయ్యారు.ఈ సమావేశానికి ముగ్గురు కార్పొరేటర్లు మినహా మిగిలిన వారంతా హాజరయ్యారు.</br

ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరడం మంచిదనే అభిప్రాయానికి వచ్చారు.త్వరలోనే కాంగ్రెస్ లో విష్ణు చేరే అవకాశం కనిపిస్తోంది.2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన మల్లాది విష్ణు 25 ఓట్ల తేడాతో విజయం సాధించారు.అయితే వచ్చే ఎన్నికల్లో విష్ణు ను మళ్లీ ఇక్కడి నుంచి పోటీకి దింపితే , గెలుపు కష్టమనే సర్వే నివేదికలతో జగన్ ఆయనను తప్పించారు.
ఇదిలా ఉంటే మల్లాది విష్ణు కాంగ్రెస్ లో చేరితే అది తన విజయవకాశాలు దెబ్బతీస్తుందనే టెన్షన్ లో బెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు.








