కొంతమందికి అదృష్టం రాసిపెట్టి ఉంటుంది.మరణం నుంచి కూడా వారు బయటపడుతుంటారు.
ఎంత పెద్ద ప్రమాదం జరిగినా అందులో నుంచి ప్రాణాలతో బయటపడిన కొందరు అదృష్టవంతులు సోషల్ మీడియా( Social Media )లో వైరల్ కూడా అయ్యారు.వారికి సంబంధించిన వీడియోలు అప్పుడప్పుడు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంటాయి.
తాజాగా ట్విట్టర్( Twitter )లో ఆ కోవకు ఒక చెందిన మరొక వీడియో ప్రత్యక్షమైంది.వైరల్ అవుతున్న వీడియోలో ఒక లగ్జరీ కారు ట్రక్కు కింద ఇరుక్కుపోవడం మనం చూడవచ్చు.
ఇంకొక ట్రక్కు వెనకే ఉంది.మొత్తంగా రెండు ట్రక్కులు, ఒక కారు ఒకదానికొకటి క్రాష్ అయినట్లు తెలుస్తోంది.
కారు ఒక బొమ్మలాగా ట్రక్కు కింద ఇరుక్కుపోయి చాలా డ్యామేజ్ అయినట్లు కూడా మనం గమనించవచ్చు.ఆ కారు ముందు డోర్ ఓపెన్ చేయడానికి కొందరు ప్రయత్నించారు.కొన్ని సెకన్లకు డోర్ ఓపెన్ అయ్యింది.తర్వాత ఏదో ఒక ఇనుప వస్తువును బయటికి మరొక వ్యక్తి లాగాడు.అనంతరం అందులో ఉన్న ప్రయాణికుడు బయటకు వచ్చాడు.అతడికి పెద్దగా గాయాలు ఏమీ కాలేదు.
ముక్కులో నుంచి రక్తం వస్తుందా అని చెక్ చేసుకున్నాడు.కాస్త ముక్కు బెదిరినట్లుంది కానీ అతడి కాళ్లు, చేతులు ఏదీ విరగలేదు.
తనంతట తానే నేలపై నిలబడగలిగాడు.పెద్దగా నొప్పి కూడా అతడికి ఏమీ కలగ లేదు.అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా అతడు ఇంత సేఫ్‌గా బయటికి రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.ఇంత అదృష్టవంతుడిని తాను ఎప్పుడూ చూడలేదని కొందరు నెటిజన్లు( Netizens ) అంటున్నారు.
మరణాన్ని మోసం చేయడం అంటే ఇదేనేమో అని మరికొందరు పేర్కొంటున్నారు.ఆ కారులో ఎయిర్ బ్యాగ్స్( Air Bags ) ఓపెన్ కావడం వల్ల ఇతడికి దెబ్బలు తాకలేదు ఏమో అని ఇంకొందరు అన్నారు.
మొత్తం మీద ఈ వీడియో చాలా మందిని ఆశ్చర్యపరిచింది.దీనిని మీరు కూడా చూసేయండి.