తేజ సజ్జా( Teja Sajja ) హీరోగా ప్రశాంత్ వర్మ( Prashanth Verma ) డైరెక్షన్ లో తెరకెక్కిన హనుమాన్ మూవీ ( Hanuman movie )బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అయితే ఈ సినిమాకు థియేటర్ల విషయంలో ఊహించని స్థాయిలో అన్యాయం జరుగుతోంది.
హైదరాబాద్ లో ఈ సినిమాకు కేవలం 5 నుంచి 6 సింగిల్ స్క్రీన్స్ మాత్రమే దక్కడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.ఈ వివాదం గురించి తాజాగా నిర్మాత నిరంజన్ రెడ్డి( Niranjan Reddy ) సైతం స్పందించారు.
ఆధిపత్యమా లేక చులకన భావమా అంటూ నిర్మాత ప్రశ్నించారు.
నిరంజన్ రెడ్డి ఒకింత ఘాటుగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుండగా ఆ వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
150 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అది పెద్ద సినిమా ఎలా అవుతుందని ప్రేక్షకులు సినిమాలను చూసిన తర్వాత ఆ సినిమాల స్థాయి అర్థమవుతుందని ఆయన కామెంట్లు చేశారు.గుంటూరు కారం సినిమా విషయంలో హనుమాన్ నిర్మాత చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.

మరోవైపు జనవరి 11వ తేదీ రాత్రి నుంచి హనుమాన్ మూవీ ప్రీమియర్లు ప్రదర్శితం అవుతాయని వార్తలు వినిపిస్తుండగా ఆ వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది.బుక్ మై షోలో హనుమాన్ సినిమాకు వస్తున్న ఇంట్రెస్ట్స్ చూసి ఇండస్ట్రీ వర్గాలు సైతం షాకవుతున్నాయి.సోలోగా రిలీజై ఉంటే ఈ సినిమా బాక్సాఫీస్ ను మరింత షేక్ చేసేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

హనుమాన్ మూవీ ట్రైలర్ కు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ రాగా హిందీలో సైతం రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజవుతోంది.70 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించానని నిర్మాత చెబుతుండగా బడ్జెట్ లెక్కలకు సంబంధించి నిజానిజాలు తెలియాల్సి ఉంది.హనుమాన్ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందో లేదో చూడాలి.







