యాదాద్రి భువనగిరి జిల్లా:ఇక రాచకొండ( Rachakonda )కు మంచి రోజులు రాబోతున్నాయని రాచకొండ రాజప్ప సమితి అధ్యక్షుడు బద్దుల కృష్ణ కుమార్ యాదవ్ అన్నారు.గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం( Narayanapoor ) మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాచకొండ కేంద్రంగా సర్క్యూట్ చేసి,దాని చుట్టూ ఉన్న విష్ణు కుండిణిల పాలనలోని ఇంద్రపాలనగరం ప్రాంతాలను అభివృద్ధి చేస్తూ దక్షిణ తెలంగాణలో ఆధ్యాత్మిక ప్రాంతాలకు కలుపుతూ కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని తెలిసిందని, ఇటీవల సీఎం క్యాంప్ ఆఫీసులో రాచకొండ అభివృద్ధిపై చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అధికారులకు ఇవ్వడం జరిగిందన్నారు.
రాజధానుల పరిగణంలోకి తీసుకుని ఒక పూర్తిస్థాయి నివేదిక తయారు చేస్తున్నామని అధికారులు వివరించారన్నారు.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి( Komatireddy Raj Gopal Redd ) చొరవ తీసుకుని రాచకొండకు అధిక నిధులు మంజూరు చేయించి,అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాజప్ప సమితి ప్రధాన కార్యదర్శి సూరపల్లి వెంకటేశం, కోశాధికారి నిమ్మల నాగేష్, సహాయ కార్యదర్శి రాసాల వెంకటేష్,అంజిరెడ్డి, భీమనపల్లి గాలయ్య, విడం సాయి కిషోర్, దూసరి వెంకటేష్, బలుగూరి ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.







