జబర్దస్త్(Jabardasth) కార్యక్రమంలో కమెడియన్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో కిరాక్ ఆర్పీ (Kiraak RP) ఒకరు.ఈయన కమెడియన్ గా జబర్దస్త్ కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైనటువంటి స్కిట్లు చేసి ప్రేక్షకులను పెద్ద ఎత్తున మెప్పించారు.
అయితే మల్లెమాల వారితో ఈయనకు వచ్చినటువంటి మనస్పర్ధలు కారణంగా ఈయన పూర్తిగా జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారు.ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చిన తర్వాత మల్లెమాల వారిపై ఎన్నో విమర్శలు చేస్తూ పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు.

ఇలా జబర్దస్త్ కార్యక్రమం నుంచి బయటకు వచ్చినటువంటి ఆర్పీ అనంతరం స్టార్ మా లో ప్రసారమవుతున్నటువంటి పలు కార్యక్రమాలలో సందడి చేశారు.అయితే ఈయనకు ఈ కార్యక్రమం ద్వారా పెద్దగా గుర్తింపు రాకపోవడంతో పూర్తిగా బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటూ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు (Nellore Pedda Reddy Chepala Pulusu) కర్రీ పాయింట్ పెట్టారు.హైదరాబాదులో మొదట ఈ రెస్టారెంట్ ప్రారంభించినటువంటి ఆర్పి భారీ స్థాయిలో సక్సెస్ కావడంతో ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఈయన ఎన్నో బ్రాంచెస్ ప్రారంభించాడు.ఇటీవల తిరుపతిలో కూడా ఒక కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

ఇకపోతే ఇటీవల పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టినటువంటి ఈయన తన బిజినెస్ పరంగాను అలాగే వ్యక్తిగత జీవితంలో కూడా చాలా సంతోషంగా గడుపుతున్నారు.ఇకపోతే ఆర్పి ఇటీవల ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.తన బిజినెస్ ఇలా సక్సెస్ అవ్వడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.అయితే తాను ఇప్పటికే ఎంతోమంది సినీ సెలెబ్రిటీలకు తన చేపల పులుసు పంపించాను అని తెలిపారు.
బోయపాటి శ్రీనుకి పంపించానని అలాగే రామ్ చరణ్(Ram Charan) ఉపాసన(Upasana) చిరంజీవికి(Chiranjeevi) కూడా తన చేపల పులుసు పంపించానని ఆర్పీ వెల్లడించారు.

ఇక ఈయన వీరందరికీ చేపల పులుసు పంపించినప్పటికీ వారి నుంచి నేనేదో ఫీడ్ బ్యాక్ తీసుకోవాలన్న ఉద్దేశంతో పంపించలేదని నేను ఫీడ్ బ్యాక్ కూడా తీసుకోలేదని తెలిపారు.ఒకసారి మా చేపల పులుసు రుచి చూసిన తర్వాత మరోసారి వారి నుంచి మాకు ఫోన్ కాల్ రావాలి ఆ లక్ష్యంతోనే మేము సెలబ్రిటీలకు పంపిస్తున్నామని ఇక ఈ చేపల పులుసు వండడంలో ఎక్కడ ఏ విషయంలోనూ రాజీ పడటం లేదని ఈ సందర్భంగా ఆర్పీ తన చేపల పులుసు గురించి అలాగే ఆయన సెలబ్రిటీలకు పంపిన విషయం గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







