వైఎస్ షర్మిల ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ క్రమంలో ఆమెకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనమైంది.ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ కాంగ్రెస్ లో చేరడం సంతోషంగా ఉందని చెప్పారు.
ఇవాళ్టి నుంచి వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ లో అంతర్భాగమని తెలిపారు.దివంగత నేత వైఎస్ఆర్ కూతురుగా కాంగ్రెస్ లో చేరడం గర్వంగా ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ అన్న వైఎస్ షర్మిల వైఎస్ఆర్ జీవితాంతం కాంగ్రెస్ కోసం కృషి చేశారని తెలిపారు.దేశంలో అన్ని వర్గాలను ఏకం చేసిన పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు.