Manisharma: జూనియర్ ఎన్టీఆర్ కోసం బలవంతంగా ఆ పాట కాపీ చేశా.. మణిశర్మ షాకింగ్ కామెంట్స్ వైరల్!

సంగీత దర్శకుడు మణిశర్మ( Manisharma ) గురించి మనందరికీ తెలిసిందే.ఈయన టాలీవుడ్ లో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకు వారీ కెరీర్ లో గుర్తుండిపోయే సూపర్ హిట్ ఆల్బమ్ సాంగ్స్ అందించారు.

 Manisharma Said He Copied That Turkish Song For Ntr Movie-TeluguStop.com

ఒకప్పుడు సంగీత దర్శకుడిగా( Music Director ) ఒక వెలుగు వెలిగిన మణిశర్మ ప్రస్తుతం అవకాశాలు లేక సినిమాలకు దూరంగా ఉంటున్నారు.గత కొంతకాలంగా అడపాదడపా సినిమాలు మాత్రమే చేస్తూ వస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మణిశర్మ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

Telugu Aadi, Chikichiki, Jr Ntr, Manisharma, Tollywood, Turkish-Movie

ఎన్టీఆర్( Jr NTR ) కోసం ఒక పాటని బలవంతంగా కాపీ చేశారట.ఆ పాట మరేదో కాదు వి వి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆది.( Aadi Movie ) ఫ్యాక్షన్ డ్రామాతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది.

ఈ చిత్రానికి మణిశర్మ ఇచ్చిన సంగీతం మరో హైలైట్ అనే చెప్పాలి.మూవీలోని ప్రతి సాంగ్ తో పాటు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది.

అయితే ఈ మూవీలోని ఓ సాంగ్ ని మణిశర్మ కాపీ చేయాల్సి వచ్చిందట.మూవీలోని మొదటి సాంగ్ చిక్ చిక్ భం భం సాంగ్ ని( Chik Chik Bum Bum Song ) మణిశర్మ కాపీ చేశారట.

ఈ పాటని టర్కిష్ సాంగ్ సిమరిక్ నుంచి కాపీ చేశారు.మణిశర్మకి ఇష్టం లేకున్నా దర్శకనిర్మాతల బలవంతం మీద ఆ పాటని కంప్లీట్ గా కాపీ చేసేశారట.

Telugu Aadi, Chikichiki, Jr Ntr, Manisharma, Tollywood, Turkish-Movie

ఈ పాట గురించి మణిశర్మ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎదుర్కొన్నారు.అలాగే ఈ పాట మాత్రమే కాదు తన కెరీర్ లో ఇలా బలవంతం మీద కొన్ని పాటలని కాపీ కొట్టినట్లు పేర్కొన్నారు.ఇక ఇదే ఇంటర్వ్యూలో మణిశర్మ మాట్లాడుతూ తన బాధని వ్యక్తం చేశారు.నేను హార్ట్ అయ్యేది దేనికంటే, మహేష్ పవన్ లాంటి స్టార్ హీరోలు అయినా అందరికి ఒక ఛాన్స్ ఇవ్వాలి.

థమన్‌కి ఒకటి, దేవికి ఒకటి, నాకు ఒకటి.పోనీ వాళ్ళకి రెండు, నాకు ఒకటి ఇచ్చినా ఆడియన్స్ కి కొత్త కొత్త మ్యూజిక్ అన్ని రకాలు, వెరైటీ వస్తుంది అంటూ అవకాశాలు రాకపోవడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

మరి ఇప్పటికైనా హీరోలు సంగీత దర్శకుడు మణిశర్మ కి ఒక్క అవకాశం అయినా ఇస్తారేమో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube