ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరిని ఏదో ఒక జుట్టు సమస్య వేధిస్తూనే ఉంటుంది.జుట్టు అధికంగా రాలడం, చిట్లడం, ముక్కలు అవ్వడం, జుట్టు ఎదుగుదల సరిగ్గా లేకపోవడం, జుట్టు కుదుళ్లు బలహీనపడడం.
ఇలా ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతుంటుంది.వీటికి చెక్ పెట్టాలంటే పైపై పూతలు సరిపోవు మంచి ఆహారం కూడా తీసుకోవాలి.
ఈ నేపథ్యంలోనే జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే ఐదు ఉత్తమ ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు ఆరోగ్యానికి తోడ్పడే ఆహారాల్లో పాలకూర( Spinach ) ముందు వరుసలో ఉంటుంది.పాలకూరలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ సి, ఫోలేట్, ఐరన్ వంటి పోషకాలు జుట్టు ఎదుగుదలను ప్రోత్సహిస్తాయి.అదే సమయంలో స్కాల్ప్ ని హైడ్రేటెడ్, హెల్తీ గా ఉంచుతుంది.
ఆరోగ్యకరమైన స్కాల్ప్ మరియు జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడానికి బీటా కెరోటిన్ ఎంతో అవసరం.అయితే బీటా కెరోటిన్ రిచ్ గా ఉండే ఆహారాల్లో చిలగడదుంప ముందు ఉంటుంది.
రోజుకు ఒక ఉడికించి చిలగడదుంప( Sweet potato ) ని తీసుకుంటే చాలా మంచిది.
అలాగే హెల్తీ హెయిర్ గ్రోత్( Healthy hair growth ) కు అవసరమయ్యే ప్రోటీన్లు మరియు బయోటిన్ లు గుడ్డులో లభిస్తాయి.రోజుకు ఒక ఉడికించిన గుడ్డును తీసుకుంటే ఒత్తైన పొడవాటి జుట్టును పొందవచ్చు.సాల్మన్ ఫిష్ కూడా జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
వారానికి ఒకసారి ఈ ఫిష్ ను తీసుకుంటే దీనిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పెలుసుగా మారిన జుట్టును దృఢంగా ఆరోగ్యంగా మారుస్తాయి.దాంతో జుట్టు చిట్లడం విరగడం తగ్గుతాయి.
ఇక జుట్టు ఆరోగ్యానికి ఉపయోగపడే ఉత్తమ ఆహారాల్లో నట్స్ అండ్ సీడ్స్ కూడా ఉన్నాయి.నిత్యం బాదం, పిస్తా, వాల్ నట్స్, అవిసె గింజలు, గుమ్మడి గింజలు వంటివి తీసుకుంటే మీరు అనేక జుట్టు సమస్యలను సులభంగా జయించవచ్చు.