ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ విస్తృతస్థాయి సమావేశం గందరగోళంగా మారింది.సమావేశం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కేశినేని నాని వర్గీయులు చించేయడంతో పాటు కుర్చీలను విసిరేశారు.
కేశినేని శివనాథ్ చిన్ని ఫొటోలున్న ఫ్లెక్సీలు ఉండటంతో నాని వర్గీయులు తీవ్రంగా మండిపడ్డారు.ఈ క్రమంలోనే కేశినేని చిన్ని ఫొటో ఎందుకు వేశారంటూ టీడీపీ ఇంఛార్జ్ శావల్ దత్ పైకి కేశినేని నాని వర్గీయులు దూసుకెళ్లారు.
దీంతో ఇరువర్గాల మధ్య చెలరేగిన వాగ్వివాదం తోపులాటకు దారి తీసింది.ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.







