టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో సింగర్ సునీత( Sunitha ) ఒకరు.తాజాగా ఈమె కుమారుడు ఆకాష్ ( Akash ) సర్కారు నౌకరి(Sarkaru Noukari) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
ఈ సినిమా జనవరి ఒకటో తేదీ విడుదల అయ్యి ఎంతో మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.ఇలా హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన వరుసగా ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాల గురించి అలాగే తన తల్లి రెండో పెళ్లి చేసుకోవడం గురించి పలు విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆకాశ మాట్లాడుతూ తాను ఏడో తరగతిలోని చిరంజీవి( Chiranjeevi ) సినిమాలు చూసి సినిమాలపై ఆసక్తి పెంచుకున్నాను.ఇదే విషయం అమ్మతో చెప్పడంతో కాళ్ళు విరగగొడతాము ముందు చదువుకో అంటూ చదువు వైపు నన్ను ప్రోత్సహించింది.ఇక డిగ్రీ వచ్చిన తర్వాత నాకు సినిమాలపై ఇష్టం ఉందనే విషయం తెలుసుకొని అమ్మ నటనలో శిక్షణ ఇప్పించిందని ఆకాష్ తెలిపారు.
అయితే కాస్త మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో ఆడవాళ్ళకి ఎంత ఒత్తిడి ఉంటుందో అనే విషయం అర్థమైందని ఈయన వెల్లడించారు.

ఇక అమ్మ ఒకవైపు ఆ ఒత్తిడిని భరిస్తూనే మరోవైపు మమ్మలందరినీ పెంచి పెద్ద చేసిందని తెలిపారు.ఇక అమ్మ రెండో పెళ్లి విషయంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందని తాను రెండో పెళ్లి చేసుకుంటే మేము ఎలా ఫీలవుతాము అనే విషయం గురించి అమ్మ చాలా కంగారు పడింది అయితే అమ్మ బాధను అర్థం చేసుకున్నటువంటి మేమే తనకు రెండో పెళ్లి చేశామని తెలిపారు.ఇక అమ్మ రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పటికీ నాన్న వస్తూ ఉంటారని, రామ్ గారితో కలిసి సరదాగా మాట్లాడుతూ ఉంటారని మాకు ఎలాంటి కోపం లేదని ఆకాష్ తెలిపారు.
ఇలా తన వ్యక్తిగత విషయాల గురించి సునీత రెండో పెళ్లి గురించి ఆకాష్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.







