అమరావతి కేసులపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం తదుపరి విచారణను ఏప్రిల్ కు వాయిదా వేసింది.
ఈ క్రమంలోనే ప్రతివాదులు నాలుగు వారాల్లో కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అయితే అమరావతే రాజధాని అంటూ గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.ఈ పిటిషన్ పై జస్టిస్ ఖన్నా, జస్టిస్ దత్తా ధర్మాసనం విచారణ జరిపి విచారణను వాయిదా వేసింది.







